రెండు నెలలు నిద్ర పట్టలేదు!

A Weak Third Single Laggam Time From LIEలేటుగా పబ్లిసిటీలోకి రంగంలోకి దిగినా… లేటెస్ట్ ఇంటర్వ్యూలతో “లై” హీరో నితిన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో “లై” సినిమా కబుర్లతో పాటు, ఇతర విశేషాలను కూడా పంచుకున్నారు నితిన్. ముఖ్యంగా అక్కినేని అఖిల్ ను హీరోగా లాంచ్ చేసిన “అఖిల్” సినిమా పరాజయం తనకు రెండు నెలల పాటు నిద్రకు దూరం చేసిందని, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా అఖిల్ తో ఓ సూపర్ హిట్ సినిమాను నిర్మిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేసారు నితిన్.

నా సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పెద్దగా పట్టించుకోలేదు గానీ, ‘అఖిల్’ ఫ్లాప్ తనపై చాలా ప్రభావితం చూపిందని, ఇండస్ట్రీలో హిట్లు వస్తే ఎవరు పక్కన చేరతారో, ఫ్లాప్ వస్తే జరిగే పరిణామాలేంటోఅన్నీ చవిచూసానని తెలిపారు నితిన్. తన పేరులో జరిగిన మార్పు తర్వాత హిట్లు లభించిన మాట వాస్తవమేనని, అంతకుముందు ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో తన పేరులో ఒక ‘ఐ’ అనే అక్షరాన్ని యాడ్ చేసానని, ఆ తర్వాత హిట్లు లభించాయని నితిన్ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఇక తన అభిమాన హీరో పవన్ విషయానికి వస్తే… తాను సినిమాల్లోకి రాక ముందు నుండే పవన్ వీరాభిమానని, ఇప్పుడు హీరోగా తనకెంతో పేరొచ్చినా తన అభిమానాన్ని వ్యక్తపరచకుండా ఎలా ఉంటానని, పవన్ ఆడియో వేడుకకు రావడం వలనే ‘ఇష్క్’ అనే సినిమా హిట్టయ్యింది అన్న మాటపై ఇప్పటికి కట్టుబడి ఉన్నానని చెప్పిన నితిన్, తాను ఏ పరిస్థితులలో ఉన్నా పవన్ పై తన స్పందన ఇలాగే ఉండేదని, అది పవన్ ను వాడుకుంటున్నారు అన్న ఫీలింగ్ కలిగినా తనకేమీ అభ్యంతరం లేదన్నట్లుగా అభిప్రాయపడ్డారు నితిన్.

ADVERTISEMENT
Latest Stories