మహేష్ బాబు ఈ సారి కూడా నిరాశపరుస్తాడా?

no look change of Mahesh Babu in anil ravipudi movie సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సెలబ్రేషన్స్ నుంచి బయటికొచ్చే సమయం ఆసన్నమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ బ్లాక్ మహేష్ బాబు కేరీర్ లో మొట్టమొదటి 100 కోట్ల షేర్ కలెక్టు చేసిన సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్‌తో కలిసి ‘మహర్షి’ విజయోత్సవాలను జరుపుకున్న మహేష్ బాబు.. ఆ తరువాత కుటుంబంతో కలిసి యూరప్‌లో విహరించారు. భార్యాపిల్లలతో ‘మహర్షి’ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ఈ సెలబ్రేషన్స్ నుంచి మహేష్ ఇప్పుడు బయటికిరానున్నారు.

ADVERTISEMENT

హాలిడే పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చారు మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాను అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ లో మహేష్ బాబు వచ్చే నెల మొదటి వారం నుండి పాల్గొనే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ఆయన ఒక ఆర్మీ సోల్జర్ గా కనిపించబోతున్నారు. గత కొన్ని సినిమాలుగా మహేష్ బాబు ఒకే గెట్ అప్ లో కనిపిస్తున్నారు.

దీనితో అభిమానులకే బోర్ కొట్టేసింది. ఆర్మీ సినిమా కాబట్టి ఈ సినిమాలో అయినా మహేష్ బాబు గెట్ అప్ మారుస్తాడు అనుకున్నారు. అయితే షూటింగ్ కు రెండు వారాల ముందు మాత్రమే హైదరాబాద్ కు రావడంతో మహేష్ బాబు ఈ సినిమా కోసం పెద్దగా లుక్ మార్చేసే అవకాశం లేదనుకుని ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. కాగా, ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT
Latest Stories