13 అంకెల మొబైల్ నంబర్లు… మీ నంబర్లేమీ మారవు

No,-your-mobile-number-will-not-have-13-digitsఇప్పటిదాకా 10 అంకెలు ఉన్న మొబైల్ నంబర్లు 13కు పెరగబోతున్నాయని ఒక వార్త ఉదయం నుండి షికారు చేస్తుంది. ట్రాయ్ కూడా దీనిని ధృవీకరించింది. జులై 1 నుండి ఇది అమలులోకి రాబోతుందంట. దీనితో ఇప్పటిదాకా ఉన్న నంబర్లు మారబోతున్నాయని అంతా ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా ఫ్యాన్సీ నంబర్లు ఉన్న వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అసలు 10 అంకెల నంబర్లే గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అంటే కొత్తగా ఈ గోలేంటి అని కొందరు ఆందోళన పడుతున్నారు. అయితే దీనిలో నిజం లేదని తెలుస్తుంది. మొబైల్ నంబర్ల అంకెలు పెరగడం నిజమే ఐయినా అవి సాధారణ మొబైల్ నంబర్లు కావని, మెషీన్ మెషీన్ కు మధ్య ఉండే మొబైల్ నంబర్లని తెలుస్తుంది.

ADVERTISEMENT

కేంద్రంలోని సమాచార శాఖ దీనిపై ఇప్పటికే ప్రకటన కూడా చేసింది. ప్రజలు వాడే మొబైల్ నంబర్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తుంది. దీనితో అంతా ఊపిరి పీల్చుకోవచ్చు. ఇప్పటిదాకా ఉన్న మొబైల్ నంబర్లు… కొత్త నంబర్లు కూడా 10 అంకెలే ఉండబోతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories