“నాన్నకు ప్రేమతో” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గత సినిమాలలో ఎప్పుడూ కనిపించని రీతిలో దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను ఫిదా చేసారు. జూనియర్ లుక్ లో గడ్డమే హైలైట్ గా నిలిచింది. అయితే దీని వెనుక ఉన్న కధ, కమామీషును చెప్పుకొచ్చారు జూనియర్.
ఈ సినిమా కోసం కొత్తగా కనపడాలని డిసైడ్ అయిన తర్వాత, గడ్డం పెంచడం ప్రారంభించామని, ఎలాంటి పరిశోధనలు చేయకుండా ఈ గడ్డం లుక్ ను ఎంపిక చేసామని, ఆ తర్వాత మొదటిసారి అమ్మ చూసి తనకు నచ్చలేదని చెప్పారు, అయితే తన భార్య ప్రణతి మాత్రం ఫస్ట్ లుక్ లోనే ‘చాలా బాగుంది’ అనే కామెంట్ ఇవ్వడంతో, తాము చేస్తోంది సరైనదేనని భావించి ముందుకెళ్లామని అన్నారు.
అమ్మ కాస్త పాతతరం మనిషి కనుక అలా అని ఉంటారని, అయితే రోజూ చూస్తున్న కొద్ది అయిదారు రోజుల తర్వాత అమ్మ కూడా బాగుందని చెప్పారని అలా ఈ లుక్ తయారయ్యిందని యంగ్ టైగర్ చెప్పారు. అయితే ఈ గడ్డం పెంచడం మామూలు విషయం కాదని, చూడడానికి సింపుల్ గా అనిపించినా చాలా ఇబ్బందులు పడ్డానని, అయితే అభిమానులకు నచ్చడంతో, పడిన కష్టమంతా మరిచిపోయామని జూనియర్ చెప్పిన మాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.





