నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమా టీజర్ ను ఈ నెల 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల బాలకృష్ణపై షూటింగ్ కూడా నిర్వహించారు. దీంతో మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య ఎలా కనిపించబోతున్నారో అన్న విషయం అభిమానులకు తెలుస్తుందని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.
కానీ తాజాగా ఈ టీజర్ రిలీజ్ ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కారణాలు ఏమిటో తెలియరాలేదు గానీ, ఈ నెల 18న మాత్రం ఈ బయోపిక్ టీజర్ రిలీజ్ కావడం లేదు. అయితే ఈ నెలలో టీజర్, ట్రైలర్ మరియు సినిమాలకు బ్రహ్మముహూర్తంగా మారిన 26వ తేదీన ఈ టీజర్ ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ‘అన్న’ గారి పాత్రలో నందమూరి నటసింహం కనిపించనుండగా, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో ఫాంలోకి వచ్చిన తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.



