సిల్వర్ స్క్రీన్ పైకి ఎన్టీఆర్ జీవితం… బాలయ్యే ఎన్టీఆర్..!

NTR Biopic - By Balakrishnaఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నట్లు నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రకటించారు. అల్లుడు లోకేష్ తో కలసి ఎన్టీఆర్ పుట్టిన ఊరు అయిన కృష్ణాజిల్లా, నిమ్మకూరులో పర్యటించిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కోరిన బాలయ్య, ఎన్టీఆర్ పై త్వరలోనే సినిమా ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, నిమ్మకూరులో తలపెట్టిన 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.

ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కనున్న సినిమాలో ‘ఎన్టీఆర్’ పాత్రలో తానే నటిస్తానని మరింత స్పష్టత ఇచ్చారు. ఎన్టీఆర్ పాత్రను పోషించడం తనకు లభించిన వరమని వ్యాఖ్యానించిన ఆయన, చిత్ర దర్శక, నిర్మాతలను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. హీరోయిన్ల ఎంపిక ప్రక్రియ అసలు మొదలు కాలేదని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఎన్నో అంశాలను అభిమానులు తెలుసుకోవచ్చని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అన్నారు.

ADVERTISEMENT

ఎన్టీఆర్ ఆశయాల మేరకే చంద్రబాబు పనిచేస్తున్నారని, నిమ్మకూరును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యానించారు. కులం, మతం పేరిట కొందరు రాజకీయాలు చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టాలని, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో అట్టడుగున ఉన్నాయని, హోదాతో పరిశ్రమలు రావన్న విషయం ఈ ర్యాంకులను చూస్తేనే తెలుస్తోందని లోకేష్ తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories