పర్ ఫెక్ట్ పిక్చర్… ఫ్యాన్స్ ఫిదా…!

NTR Biopic First Lookనిజానికి ఈ సమయానికి “ఎన్టీఆర్” పాత్రలో బాలకృష్ణ నటించిన బయోపిక్ టీజర్ మారుమ్రోగిపోతూ ఉండాలి. కానీ అనుకోని రీతిలో సదరు టీజర్ ను తాత్కాలికంగా వాయిదా వేసారు. కొత్త డేట్ ను ఇంకా ప్రకటించలేదు గానీ, ఈ వాయిదాకు గల కారణాలు కూడా తెలియరాలేదు. దీంతో నందమూరి అభిమానులంతా కాస్త నిరుత్సాహం చెందిన మాట వాస్తవమే. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ADVERTISEMENT

విడుదల చేసిన పోస్టర్ కూడా అదిరిపోయే రీతిలో ఉండడంతో అభిమానుల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం ఉరకలేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించి, ప్రచారానికి వెళ్ళిన సమయం నాటి ఫోటోను అన్న గారు చెప్పిన “ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం” ట్యాగ్ లైన్ ను జోడిస్తూ రిలీజ్ చేసారు. బ్లాక్ అండ్ వైట్ గా ఉన్న ఈ ఫోటోలో నందమూరి తారక రామారావు మైక్ పట్టుకుని నిల్చుంటే, నాటి టిడిపి వ్యవస్థాపన రోజులను తలచుకుని మురిసిపోవడం అభిమానుల వంతవుతోంది.

అశేష జనసమూహం నడుమ ఎన్టీఆర్ ఇచ్చిన నాటి స్పీచ్ లు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కావడంతో… ఈ పోస్టర్ చూడగానే ఫ్యాన్స్ లో నూతన ఉత్తేజం నెలకొంది. అంతేకాదు ఎన్టీఆర్ బయోపిక్ ను తేజ సరిగ్గానే తెరకెక్కిస్తారన్న నమ్మకమూ ఏర్పడిందని చెప్పవచ్చు. ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. రిపబ్లిక్ డే నాడు ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారంతో కూడిన టీజర్ విడుదల కావచ్చన్నది సినీ వర్గాల తాజా సమాచారం.

ADVERTISEMENT
Latest Stories