బ్యాట్స్ మెన్లు, బౌలర్లు వ్యక్తిగతంగా సాధించే రికార్డులు దాదాపుగా క్రికెట్ అభిమానులకు తెలుస్తూనే ఉంటాయి. కానీ, క్రికెట్ చరిత్రలో జట్ల వారీగా కూడా కొన్ని రికార్డులు ఉంటాయి. అంటే క్రికెట్ మొదలుపెట్టిన నాటి నుండి ఇప్పటివరకు నమోదైన రికార్డులు అన్న మాట. ఒక జట్టు మొత్తమ్మీద ఎన్ని వికెట్లు పడగొట్టింది? ఎన్ని పరుగులు సాధించింది? అన్న రికార్డులను పరిశీలిస్తే… టీమిండియా ఈ రెండు విభాగాల్లోనూ రెండవ స్థానంలో ఉందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన జట్లను పరిశీలిస్తే…
1) పాకిస్తాన్ – 6233
2) ఇండియా – 6056
3) ఆస్ట్రేలియా – 5582
4) శ్రీలంక – 5573
5) వెస్టీండీస్ – 5151
6) న్యూజిలాండ్ – 5144
7) ఇంగ్లాండ్ – 4840
8) జింబాబ్వే – 3813
9) దక్షిణాఫ్రికా – 3611
10) బంగ్లాదేశ్ – 2566
వన్డేలలో అత్యధిక పరుగులను నమోదు చేసిన జట్లను పరిశీలిస్తే…
1) ఆస్ట్రేలియా – 200947
2) ఇండియా – 199096
3) పాకిస్తాన్ – 188324
4) శ్రీలంక – 165473
5) వెస్టీండీస్ – 155075
6) న్యూజిలాండ్ – 147681
7) ఇంగ్లాండ్ – 146241
8) దక్షిణాఫ్రికా – 128003
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers #contest2 pic.twitter.com/Yx6Z5Wql50
— M9News (@M9News) January 23, 2017



