బోయపాటి అఫిషియల్… ఫ్యాన్స్ కు పండగే..!

వరుసగా సినిమాలు చేస్తూ మాంచి దూకుడు మీదున్న ప్రిన్స్ మహేష్ బాబు త్వరలో ‘మాస్’ మెగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వాస్తవానికి ఇది పాత వార్తే. అయితే అప్పుడు కేవలం ఓ అనాధికారిక సమాచారంగా హల్చల్ చేయగా, ఇప్పుడు మాత్రం అఫిషియల్ గా మారిపోయింది. అవును… స్వయంగా బోయపాటి శ్రీను ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

ఆదివారం నాడు బుల్లితెరపై ప్రసారమైన ఓ వీకెండ్ కార్యక్రమంలో ‘జయ జానకి నాయక’ చిత్ర హీరోహీరోయిన్లతో కలిసి పాల్గొన్న బోయపాటి, త్వరలో తాను ప్రిన్స్ మహేష్ బాబుతో పని చేయబోతున్నానని ప్రకటించారు. ఇందులో విశేషం ఏమిటంటే… ఇప్పటికే కధ కూడా సిద్ధమైపోయిందట. దీంతో త్వరలోనే ఈ కాంభినేషన్ పట్టాలెక్కడం ఖాయం. బహుశా వంశీ పైడిపల్లి సినిమా తర్వాత బోయపాటితో ప్రిన్స్ వర్క్ చేస్తారేమో చూడాలి.

ADVERTISEMENT

మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో బోయపాటి శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే మహేష్ ఫుల్ లెంగ్త్ మాస్ మూవీలో నటించాలనేది ఎప్పటినుండో ప్రిన్స్ అభిమానుల కోరిక. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2018లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోయే ఈ సినిమా అభిమానులకు కన్నులవిందు చేయడం ఖాయమేమో! తాను తీసిన ‘సరైనోడు’ టైటిల్ కు తన మదిలో మెదిలే హీరో ఎవరు అంటే ‘మహేష్ బాబు’ అంటూ బదులిచ్చిన బోయపాటి, ప్రిన్స్ ను ఏ విధంగా చూపిస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories