యూ ట్యూబ్ లో 15 కోట్ల క్లిక్స్ ను పైనే అందుకుంది!

OK Jaanu 'Humma Humma song youtube clicksసాధరణంగా సినిమా హిట్ అయితే పాటలు కూడా ప్రజాధరణ పొందుతాయి. కానీ కొన్ని కొన్ని పాటలు మాత్రం సినిమా హిట్, ఫ్లాప్ అన్న టాక్ తో నిమిత్తం లేకుండా సూపర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. అలాంటి జాబితాలో ఇటీవల కాలంలో విడుదలైన “ఓకే జాను” సినిమాలోని హమ్మ హమ్మ అనే పాట యూ ట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. నిజానికి ఈ సినిమాకు వ‌చ్చిన స్పందనకు, పాటకు లభిస్తున్న ఆద‌ర‌ణ‌కు ఏ మాత్రం సంబంధం లేదు.

ADVERTISEMENT

ఈ సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీలో భాగంగా, చిత్ర బృందం మూడు నెలలకు ముందు ఈ రీమిక్స్ పాట‌ను విడుద‌ల చేసింది. విడుదలైన నాటి నుండి ఇప్పటివరకు ఈ పాట ఒక్క యూ ట్యూబ్‌ లోనే 15 కోట్ల 33 లక్షల వ్యూస్‌ ను సాధించింది. ఈ పాటకు లభిస్తున్న ఆదరణ పట్ల సోనీ మ్యూజిక్ ఇండియా సంస్థ తమ ట్విట్ట‌ర్ ఖాతాలో హ‌ర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. దిగ్గ‌జ‌ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహమాన్ అందించిన ‘హమ్మ హమ్మ’ పాటను “ఓకే జాను” కోసం రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే.

ఈ పాట‌లో శ్ర‌ద్ధాకపూర్ అందాలకు రెహ‌మాన్ మ్యూజిక్ తోడ‌వడంతో ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు యూ ట్యూబ్‌లో బేఫికర్ లోని ‘నషే సి చద్’ 20 కోట్ల 11 ల‌క్ష‌ల‌ వ్యూస్‌ తో తొలిస్థానంలో ఉంది. ఈ వీడియో సాంగ్‌ను గ‌త ఏడాది అక్టోబ‌ర్ 18న విడుదల చేయగా, ఆ త‌రువాత‌ బార్ బార్ దేఖో సినిమాలోని ‘కాలా చెష్మా’ 20 కోట్ల 2 లక్షల వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది. ఆ త‌రువాతి స్థానంలో రెహమాన్ ‘హమ్మ హమ్మ’ సాంగ్ నిలిచింది.

ADVERTISEMENT
Latest Stories