విడుదలకు ముందే ఆన్ లైన్ లో ఫుల్ వీడియో సాంగ్!

Om Namo Venkatesaya Songs Online Leaked - ONVతమ సినిమాల విడుదలకు ముందే వీడియో సాంగ్ లను విడుదల చేసి, ప్రమోషన్లు ఇవ్వడం బాలీవుడ్ లో సర్వ సాధారణమైన విషయం. అయితే టాలీవుడ్ కు వచ్చేపాటికి కేవలం 10, 20 సెకన్ల టీజర్లు మాత్రమే ప్రధానంగా విడుదల చేస్తుంటారు. అది కూడా కొన్ని ఎంపిక చేసిన సినిమాలకు మాత్రమే విడుదల చేస్తుంటారు. విడుదలైన 50 రోజుల తర్వాత గానీ, తెలుగు సినిమాల వీడియో సాంగ్స్ విడుదల కావు. కానీ, నాగార్జున “ఓం నమో వేంకటేశాయ” సినిమా రూట్ మార్చింది.

ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ‘అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకా…’ అనే పాటను చిత్ర యూనిట్ యూ ట్యూబ్ లో అధికారికంగా విడుదల చేసి సంచలనం సృష్టించింది. విజువల్ ట్రీట్ గా ఉన్న ఈ పాట, వినడాని కంటే వీక్షించడానికి బాగుందని చెప్పాలి. ఆడియో పరంగా ‘ఓం నమో వేంకటేశాయ’ పాటలకు శ్రోతల నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో, సినిమాకు ఆశించిన ప్రచారం కూడా దక్కలేదు. నాగార్జున గత చిత్రాలతో పోలిస్తే… చాలా తక్కువ అంచనాలతో ఈ సినిమా విడుదల అవుతోంది.

ADVERTISEMENT

బహుశా ఈ అంచనాలను రెట్టింపు చేసేందుకే ఏమో గానీ, ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయడం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఏదైనా ఒకటి, అర చిన్న సినిమాలకు ఇలాంటి పబ్లిసిటీని అనుసరించారేమో గానీ, ఒక ప్రముఖ హీరో సినిమా ఫుల్ వీడియో సాంగ్ ను విడుదలకు ముందే రిలీజ్ చేయడం ఇదే ప్రధమం. ఏది ఏమైనా ట్రెండ్ ను సృష్టించడంలో నాగ్ ఆరితేరిన వారు కదా! ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా సక్సెస్ అయితే, బహుశా ఇదే ట్రెండ్ ను మరికొన్ని పెద్ద చిత్రాలు అనుసరిస్తాయోమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories