వాట్ ఎ ఐడియా… 1 రూపాయికే అన్ లిమిటెడ్ 4జీ..!

one-rupee-idea-cellular-4g-internet-dataరిలయన్స్ జియో దెబ్బతో వణికిపోతున్న ఇతర టెలికం సంస్థలు తమ వినియోగదారులను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. డేటా చార్జీలను తగ్గిస్తూ జియో వైపు చూడకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. వినియోగదారులను ఆఫర్ల మత్తులో జోకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా టెలికం దిగ్గజ సంస్థ ఐడియా ఒక్క రూపాయికే అన్‌ లిమిటెడ్ 4జీ డేటా ఇస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది.

ఈ ఆఫర్ ను పొందాలంటే… వినియోగదారుడి వద్ద తొలుత ఐడియా 4జీ సిమ్‌ తో పాటు 4జీ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు అకౌంట్‌లో రూపాయి బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి. తర్వాత 411కు కాల్ చేసి వచ్చే సూచనలకు అనుగుణంగా ఫాలో కావాలి. ఆఫర్ యాక్టివేట్ అయిన తర్వాత కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. దీంతో ఆఫర్ యాక్టివేట్ అయినట్టే. ఎంచక్కా డేటాను వాడేసుకోవచ్చు. అయితే ఇక్కడో చిక్కు ఉంది మరి!

ADVERTISEMENT

ఈ అన్‌ లిమిటెడ్ డేటాను కేవలం గంట పాటు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. తర్వాత డేటా పనిచేయదు. ఈ గంట సమయంలో 4జీబీ – 5జీబీ వరకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త ప్యాక్ యాక్టివేట్ అయిన వెంటనే పాత డేటా ప్యాక్ ఆగిపోతుంది. ఒకే నంబరు నుంచి మూడు సార్లు ఈ అన్‌ లిమిటెడ్ ఆఫర్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.

ADVERTISEMENT
Latest Stories