కత్తి పాపం చంద్రబాబు మీదకు తోసే ప్రయత్నం

Chandrababu Naidu - Mahesh Kathiగత కొద్దికాలంగా బిగ్ బాస్ తో పాపులరైన కత్తి మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆయనకు కొత్త ఎఫైర్ ఒకటి అంటగడుతున్నారు కూడా. దీని మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అయితే తాజా వివాదాన్ని చంద్రబాబు మెడకి తగిలించాలని చూస్తున్నారు కొందరు.

ADVERTISEMENT

బీజేపీ, వైకాపాకు చెందిన కొందరు కత్తి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోపించి జనసేన టీడీపీ మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని పరకాల ప్రభాకర్ ను అడ్డం పెట్టుకుని దెబ్బ తీసారని తరువాత ఆయనకు పదవులు కట్టబెట్టారని గుర్తు చేస్తున్నారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి కమ్మ ఛానళ్ళు అయినా టీవీ9, ఆంధ్రజ్యోతి, మహా టీవీ ద్వారా కత్తిని ప్రమోట్ చేస్తున్నారని ఆరోపణ. అయితే దీనిలో ఏమాత్రం నిజం లేదని, కత్తికి తమకు ఎలాంటి సంబంధం లేదని, తమకు పవన్ కళ్యాణ్ ఆప్తుడని తేల్చి చెబుతున్నారు టీడీపీ నాయకులు.

నిన్ననే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు మేలు చేసే జీఓ ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకం అంటున్నారు. రాజకీయ దిగజారుడుతనం కాకా ఇంకేమిటి ఇది? అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే కత్తి బాగా తెలిసిన వారందరూ ఆయన టీడీపీ బీజేపీలకు వ్యతిరేకమని, జగన్ వీరాభిమాని అని చెప్పుకొస్తున్నారు. గతంలో వైకాపాకు అనుకూలించేలా రాసిన ఎన్నో పోస్టులు చూబిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories