ఈ ఒక్కడికే సాధ్యం!

Paisa-Vasool-release date on September 1stఅగ్ర హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తూ అనుకున్న సమయానికి విడుదల చేయడం అనేది టాలీవుడ్ లో ఒక్క పూరీ జగన్నాధ్ కే సాధ్యం అని చెప్పకతప్పదు. గతంలో మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి హీరోలతో… సినిమాలను ప్రారంభించిన రోజునే రిలీజ్ డేట్ చెప్పి, సరిగ్గా అదే సమయానికి విడుదల చేసిన పూరీ, ఈ సారి అయితే ఏకంగా 28 రోజులు అడ్వాన్సుగా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ADVERTISEMENT

అవును… షూటింగ్ ప్రారంభించిన రోజునే సెప్టెంబర్ 29వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించిన పూరీ, తాజాగా అదే సినిమాను సెప్టెంబర్ 1వ తేదీకి ప్రీ పోన్ చేసారు. సాధారణంగా ‘పోస్ట్ పోన్’ అన్న మాట తప్ప, ‘ప్రీ పోన్’ అనేది టాలీవుడ్ ‘డిక్షనరీ’లో లేని పదం. కానీ ‘ట్రెండ్’ను తాను సృష్టించడమే గానీ, అస్సలు ఫాలో అవ్వని పూరీ ‘డిక్షనరీ’లో ఇలాంటి కొత్త పదాలు ఎప్పుడూ వచ్చి చేరుతుంటాయి.

అయితే ఇదేమీ సాధారణ విషయం కాదు. పెద్ద సినిమాను ఏకంగా ఒక నెల రోజులు ముందుగా విడుదల చేయడం అంటే, ఆ గట్స్ ఒక్క పూరీకే సొంతం. ఒక రకంగా ఇది సేఫ్ గేమ్ అని కూడా చెప్పొచ్చు. దసరా బరిలో ‘జై లవకుశ, స్పైడర్’ చిత్రాలు ఉండడంతో, ఆ రెండు చిత్రాల నడుమ విడుదలై ఇరుక్కుపోవడం కన్నా, ముందుగా విడుదలై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడమే మేలని నిర్ణయించుకున్నట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories