ట్రైలర్ టాక్ – డైలాగ్స్ అదరగొట్టారు!

Paper Boy Movie Trailer Talkమాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది తొలిసారిగా నిర్మిస్తోన్న “పేపర్ బాయ్” ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సంతోష్ శోభన్, రియా సుమన్ లు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. కధ చెప్పాలంటే… సింపుల్… ఆర్ధికంగా వెనుకబడిన హీరో… ఫైనాన్షియల్ గా పుష్కలంగా ఉన్న హీరోయిన్..!

ఈ ఇద్దరు ఎలా కలుస్తారు? అనేదే కధ. ఇలాంటి కధలకు కొదవలేదు. అయితే సహజత్వానికి దగ్గరగా ఉండడం, పదునైన సంభాషణలు ఈ ట్రైలర్ లో హైలైట్స్ గా నిలిచిన అంశాలు. ముఖ్యంగా ‘ప్రేమ అనేది ఆక్సిజన్ లాంటిది, అది కనిపించదు, కానీ బ్రతికిస్తుంది… ముద్దు పెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు, ఊపిరి మార్చుకోవడం…’ వంటి డైలాగ్స్ బాగున్నాయి.

ADVERTISEMENT

అలాగే భీమ్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రొటీన్ కధలకు తనదైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది సంపత్ నంది రెగ్యులర్ గా ఫాలో అయ్యే విషయం. తన ప్రొడక్షన్ లో కూడా అదే కొనసాగించినట్లుగా ఈ ట్రైలర్ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories