ఇడుపు కాయితం రిలీజ్ టైంలో మొదలైన తెలుగు వర్సెస్ తెలంగాణ సోషల్ మీడియా గొడవలు.. ఇవాళ (ఆగస్ట్ 29) తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తారా స్థాయికి చేరాయి.
ఇవాళ ప్యారడైజ్ నుండి రెండో పాట వచ్చింది. తెలంగాణ ఫోక్ సాంగ్ అయిన ఏష నాగుల అనే పాటను రీమిక్స్ చేసి రిలీజ్ చేసారు. ఉదయం అమెరికాలో నిర్వహించిన కాన్సర్ట్ లో రిలీజ్ లాంచ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని గంటల క్రితం విడుదలైన వీడియో సాంగ్ విషయంలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి… ముఖ్యంగా సాంగ్ ఎనర్జీని నాని-కీర్తి సురేష్ తెరపై చూపించలేకపోయారని కామన్ కామెంట్.
పాట రెస్పాన్స్ కాసేపు పక్కన పెడితే.. ట్విట్టర్లో మాత్రం తెలుగు వర్సెస్ తెలంగాణ అనేది మళ్లీ మొదలైంది. తెలంగాణలో ఎక్కువ ఫోక్ సాంగ్స్ ఉన్నాయా? ఆంధ్రాలో ఎక్కువ పాపులర్ ఫోక్ సాంగ్స్ ఉన్నాయా అనే చర్చలు మొదలయ్యాయి.
ఆ చర్చలు వ్యంగ్యంగా మారి దిగజారుడు స్థాయికి వెళ్తున్నాయి. ఈ పెంట మొత్తం ప్యారడైజ్ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీలా పనికొస్తోంది. గతంలో టీజర్ లో డైలాగ్స్ సౌండ్ మిక్సింగ్ కారణంగా వినిపించడం లేదు అనే కామెంట్స్ వచ్చినప్పుడు.. అప్డేట్ చేసిన వెర్షన్ ని పోస్ట్ చేసి “in telugu” అని వ్యంగ్యంగానే పోస్ట్ చేసాడు శ్రీకాంత్ ఓదెల కూడా.
మరి ప్యారడైజ్ రిలీజ్ టైమ్ కి ఈ తెలుగు వర్సెస్ తెలంగాణ గొడవలు ఏ స్థాయికి చేరుకుంటాయి? అనేది ఊహించడానికే ఇబ్బందిగా ఉంది.





