లింగం మావయ్యా… ఎంత పని చేసావ్..!

paresh rawal hit the fan at the airport‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ‘లింగం మావయ్య’ అంటూ ఆటపట్టించే నటుడు గుర్తున్నారా..! ఆ పాత్రకు ప్రాణం పోసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు పర్వేష్ రావల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. దీనికి కారణం… తనతో ఒక సెల్ఫీ తీసుకుందామని వచ్చిన అభిమానిని ఫోన్ మాట్లాదుతూ చేత్తో తోసేసి కెమెరా కంటికి చిక్కాడు. దీంతో ‘లింగం మావయ్య’ పని పట్టడం నెటిజన్ల వంతయ్యింది.

ఈ ఉదంతానికి ముందే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా తన అభిమానిపై చేయి చేసుకుని, తర్వాత క్షమాపణలు చెప్పి తన చేతులు కాల్చుకున్న వైనం తెలిసిందే. ఇటీవలే బహిరంగ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి శుభంకార్డు పడగా, ఇంతలో ‘లింగం మావయ్య’ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. దీంతో ఈ ఉదంతం ఎలాంటి రచ్చకు దారి తీస్తుందో అన్న అంచనాలు మొదలయ్యాయి. ‘శంకర్ దాదా’లో చిరంజీవి ‘లింగం మావయ్య’ పని పట్టగా, ఈ ఎపిసోడ్ లో ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారో చూడాలి..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories