షాకింగ్ : ఇది ఊహాతీతం… దట్స్ ది బ్యూటీ…!

Pawan Kalyan Agnyaathavaasi collections dropping‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్ – పవన్ కాంబోల “అజ్ఞాతవాసి” సరికొత్త చరిత్రను తిరగరాసే చిత్రంగా నిలుస్తోంది. అయితే జరుగుతోంది అంచనాలు వేసిన చరిత్ర కాదు, ఎవరి అంచనాలకు అందని రీతిలో సాగుతోన్న చరిత్ర ఇది. తెలుగు సినిమా చరిత్రలోనే “బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఆల్ టైం” అన్న రీతిలో “అజ్ఞాతవాసి” కలెక్షన్స్ ఉండడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. ఈ సినిమా పరిభాషలోనే చెప్పాలంటే… వసూలు చేస్తోన్న కలెక్షన్స్ ను ‘ఊహాతీతం’ అనాలి… ప్రేక్షకులు ఇచ్చిన తీర్పును ‘దట్స్ ది బ్యూటీ’ అని అభివర్ణించాలి.

ADVERTISEMENT

టాక్ తో నిమిత్తం లేకుండా ఓపెనింగ్స్ రాబట్టడంలో ‘కింగ్’ పవన్ కళ్యాణ్ అని ఇప్పటివరకు చెప్పుకునేరు. కానీ ‘అజ్ఞాతవాసి’తో అందులో ఎంత వాస్తవం ఉందో ట్రేడ్ వర్గాలకు తెలిసి వచ్చింది. తొలి రోజు పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ ను మాత్రమే సొంతం చేసుకున్న ‘అజ్ఞాతవాసి’ రెండు, మూడు రోజులలో అయితే అత్యంత దారుణమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… గత దసరాకు విడుదలై ప్రేక్షకులను ఓ రేంజ్ లో నిరుత్సాహపరిచిన మహేష్ బాబు “స్పైడర్” సినిమా కలెక్షన్స్ కంటే దారుణంగా ‘అజ్ఞాతవాసి’ వసూళ్లు ఉన్నాయంటే… ఏ రేంజ్ లో పవన్ స్టామినా నిలబడిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదేదో అమెరికన్ మార్కెట్ లో అనుకుంటే పొరపాటే..! మాస్ ఫాలోయింగ్ విపరీతంగా కలిగిన ఏపీ, తెలంగాణాలలో పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటే, ఇక యుఎస్ పొజిషన్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రేక్ ఈవెన్ రావాలంటేనే హీనపక్షంగా 4 మిలియన్ డాలర్స్ వసూలు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ రిపోర్ట్ ను చూస్తే అందులో సగం వచ్చినా గానీ గొప్పగానే భావించాలి. ప్రీమియర్స్ తోనే 1.5 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టి, రికార్డ్ ఓపెనింగ్స్ అయితే సాధించింది గానీ, ఒక్కసారి ధియేటర్ లో బొమ్మ పడి టాక్ బయటకు వచ్చిన తర్వాత కొల్లగొట్టింది కేవలం 2 లక్షల డాలర్స్ మాత్రమే. అంటే ప్రస్తుతం 1.7 మిలియన్ డాలర్స్ వద్ద ఉన్న ‘అజ్ఞాతవాసి’ 2 మిలియన్స్ కు చేరుకోవడం అసాధ్యంలా కనపడుతోంది.

ఈ తరుణంలో డిస్ట్రిబ్యూటర్ల నుండి చిత్ర యూనిట్ పై ఎలాంటి ఒత్తిడి వస్తుందో అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ కృష్ణాజిల్లా పంపిణీదారుడు చేసిన హంగామా సినీ జనులకు తెలియనిది కాదు. అలాగే నష్టాలు వచ్చినపుడు పవన్ గతంలో తన రెమ్యూనరేషన్ లో కొంత భాగాలను తిరిగి ఇచ్చిన సందర్భాలున్నాయి. ‘అజ్ఞాతవాసి’తో మళ్ళీ అదే సీన్స్ రిపీట్ అవుతాయేమో అన్న టాక్ ట్రేడ్ వర్గాలలో అయితే బలంగా వినపడుతోంది. దాదాపుగా అన్ని ఏరియాలలో 50 శాతానికి పైనే నష్టాలు వాటిల్లే పెనుప్రమాదం ఉందన్న సంకేతాలు రెండు, మూడు రోజుల కలెక్షన్స్ ఇచ్చాయి. క్రేజీ కాంబోలు, హీరోలు, దర్శకులు అన్న తేడా లేకుండా ప్రేక్షకులు ఇస్తున్న తీర్పుతో అగ్ర హీరోలు, దర్శకులు కళ్ళు తెరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories