పవన్ ను రాజకీయంగా విమర్శించడానికి ఎటువంటి అంశాలు లేకపోవడంతో మూడు పెళ్లిళ్లు, నాలుగు పెళ్ళాలు అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలుకుని నిన్న మొన్న జనసేన నుండి వైసీపీలో చేరిన పోతిన మహేష్ వరకు పవన్ కు నాలుగు పెళ్ళాలు అంటూ పవన్ వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుకీడుస్తున్నారు.
ముఖ్యంగా ఎన్నికలకు ముందు జనసేన వీడి వైసీపీ పార్టీలో చేరిన పోతిన మహేష్ దమ్ముంటే మీ భార్యను తీసుకుని మీరు పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి రాగలరా..? పిఠాపురంలో మీరు తీసుకున్నఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి మీ సతీమణి తో కలిసి వస్తారా.? అంటూ పవన్ కు అతని భార్య అన్నా లెజినోవాకు మధ్య విభేదాలు వచ్చాయి అనేవిధంగా ప్రజలను నమ్మించడానికి అన్ని అస్త్రాలను ఉపయోగించారు జగన్.
అయితే ఇప్పుడు వాగిన ప్రతి వైసీపీ నోరు మూసుకునేలా, ఎత్తిన ప్రతి చెయ్యి ముడుచుకునేలా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా తన చేతలతోనే వారికీ గుబపగిలే కౌంటర్ ఇచ్చారు పవన్. ఈ రోజు ఎన్నికల సందర్భంగా మంగళగిరిలో తన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి తన భార్య అన్నా లెజినోవా తో కలిసి సతీసమేతంగా పోలింగ్ బూత్ కు వచ్చారు పవన్.
దీనితో ఇన్నాళ్లు నాలుగు పెళ్ళాలు అంటూ వాగుతున్న ప్రతి వైసీపీ నేతకు సరైన సమాధానం చెప్పారు పవన్ అంటూ పవన్, అన్నా ల వీడియో ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు జనసేన అభిమానులు. అయితే పిఠాపురం ఎన్నికల ప్రచారం ముగింపు సభలోనే పవన్ దీని పై ఒక క్లారిటీ ఇచ్చారు. పోలింగ్ డే రోజు నాతో కలిసి పిఠాపురం వస్తే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని భార్యకు చెప్పా అంటూ తనకు తన భార్య అన్నా కు మధ్య జరిగిన సంభాషణను సభలో పంచుకున్నారు పవన్.
దీనితో పోలింగ్ డే రోజు అన్నా బయటకు రావడం, పవన్ మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు లోపలికి వెళ్లడం ఖాయం అనేది స్పష్టమయింది. కొన్ని సార్లు రావడం లేటు కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అనే పవన్ సినిమాలో డైలాగ్ తో వైకాపా నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు జనసైనికులు, పవన్ అభిమానులు. అలాగే అన్నా లెజినోవాకు మంగళగిరి చేనేత చీరను అందించారు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు.




