LOL : పవన్ కళ్యాణ్ పై న్యూస్!

Why-Are-Pawan-Kalyan-Bhakts-Maintaining-Silenceఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మినహాయిస్తే… అగ్ర దర్శకులతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పనిచేయడానికి ఆసక్తి చూపించరన్న విషయం తెలిసిందే. ఎందుకు పెద్ద డైరెక్టర్లతో జతకట్టరు? అన్న విషయం కూడా బహిరంగమే. మరి అలాంటి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఫోన్ వెళ్ళిందనే వార్త ఎలా ఉంటుంది? ఖచ్చితంగా హాస్యాస్పందంగానే ఉంటుంది కదా! ప్రస్తుతం అలాంటి హాస్యాన్నే నెటిజన్లు పండిస్తున్నారు.

‘అజ్ఞాతవాసి’ ఫలితంతో ఎలాగైనా నెక్స్ట్ బొమ్మ ‘బ్లాక్ బస్టర్’ పడాలన్న ఉద్దేశంతో ఓ సినిమా కోసం పవన్ ఆఫీస్ నుండి బోయపాటికి ఫోన్ కాల్ వెళ్లిందని, ఇందు నిమిత్తం బోయపాటికి అప్పాయింట్మెంట్ కూడా కుదిరిందని, అతి త్వరలోనే బోయపాటి – పవన్ లు కలిసి ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపబోతున్నారనే టాక్ హల్చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ‘డైరెక్టర్స్ హీరో’ కాదన్న టాక్ ఇండస్ట్రీలో ఓపెన్. మరి అలాంటి పవన్ తో నిజంగా బోయపాటి సినిమా చేసే అవకాశం ఉందా?

ADVERTISEMENT

‘నిప్పు లేనిదే పొగ రాదు’ అన్న చందంగా ఒకవేళ నిజంగా పవన్ ఆఫీస్ నుండి బోయపాటికి కాల్ వెళ్ళిన మాట వాస్తవమైనా గానీ, ఇప్పట్లో అది కార్యరూపం సిద్ధించుకునే అవకాశం లేదని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ శుక్రవారం నాడు బోయపాటి – రామ్ చరణ్ ల సినిమా ప్రారంభం కాబోతోంది. అంటే మరో ఆరు నెలల పాటు బోయపాటి బిజీ. మరి ఈ ఆరు నెలల పాటు పవన్ ఖాళీగా ఉండే ఆస్కారం లేదు. ఆరు నెలల తర్వాత సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తాయి గనుక, పవన్ సినిమాలే చేసే అవకాశం లేదు. అందుకే ఇది అత్యంత హాస్పాస్పదమైన పుకారుగా కొనియాడబడింది.

ADVERTISEMENT
Latest Stories