ఎస్పీ బాలుకు నివాళి కూడా అర్పించకుండా బీజేపీ భజనలో పవన్ కళ్యాణ్ బిజీ

Pawan Kalyan Vakeel Saab movie shootingతెలుగు తేజం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరు. కోట్లాది అభిమానులను శోకసముద్రంలో ముంచి బాలు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ హఠాన్పరిణామం పట్ల తెలుగు సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి చెంది ప్రముఖులు అంతా తమ అంజలి ఘటిస్తున్నారు. అయితే ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి.

ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతికి సంతాపం కూడా తెలుపని పవన్ కళ్యాణ్ ఈరోజు పండిట్ దీనదయాళ్ జయంతి ఆయన కలలుగన్న అంత్యోదయం వైపుగా ఆత్మనిర్భర భారతం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన నాయకత్వంలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు అంటూ బీజేపీ భజన ట్వీట్ చేశారు. అది కూడా బాలు మరణ వార్తల బయటకు వచ్చి గంట కూడా కాకముందే.

ADVERTISEMENT

దీనితో పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం పెల్లుబిక్కింది. భజనకు సమయం సందర్భం లేదా అంటూ పలువురు విరుచుకుపడుతున్నారు. కనీసం బాలు మృతికి నివాళి అర్పించి ఆ ట్వీట్లు వేసుకుని ఉంటే రియాక్షన్ కొంచెం తక్కువగా ఉండేదేమో. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేసే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది.

బాలుకు నివాళులు అర్పించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు ఉండడం గమనార్హం. “బాలు నా సొంత అన్నయ్య, నా అన్నయ్యను కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నా.. మా మధ్య ఉన్నది కేవలం సినీబందమే కాదు, తెలుగు సినిమాకు బాలు లోటు ఇంకెవ్వరూ పూడ్చలేనిది,” అని చిరంజీవి అన్నారు.

ADVERTISEMENT
Latest Stories