పవన్ కళ్యాణ్ అండదండలు… ఓపెనింగ్స్ గ్యారెంటీ…!

Pawan Kalyan Chief Guest Saptagiri Express Movie Audio Launchకమెడియన్ గా తనకంటూ ఓ మార్క్ వేసుకున్న సప్తగిరి, తాజాగా ప్రధాన పాత్రలో “సప్తగిరి ఎక్స్ ప్రెస్” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్ పిక్చర్ సప్తగిరి అభిమానులను మెప్పించడంలో విజయవంతమైంది. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుకకు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారని ట్రేడ్ వర్గాల టాక్.

అదే జరిగితే, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాకు ఓపెనింగ్స్ కొదవుండదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకలకు విచ్చేసే సినిమాలపై ఆయన అభిమానులు కూడా ఒక కన్నేసి ఉంచుతారన్న విషయాన్ని గతంలో చాలా చిత్రాలు నిరూపించాయి. దీంతో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’కు పవర్ స్టార్ ఫ్యాన్స్ తోడయితే అది రాకెట్ వేగంలో దూసుకెళ్ళడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

ADVERTISEMENT

సప్తగిరి స్నేహితుడు రవి కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ పవర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 6వ తేదీన పవర్ స్టార్ ముఖ్య అతిధిగా హైదరాబాద్ లో ఈ చిత్ర ఆడియో విడుదలకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది. దీంతో చాలామంది హీరోలకు సైతం దక్కని అదృష్టం కమెడియన్ సప్తగిరికి దక్కింది అంటున్నారు సినీ జనాలు.

ADVERTISEMENT
Latest Stories