ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్, కేటీఆర్ బ్రోమాన్స్

Pawan-Kalyan-Says,-'Sir!',-KTR-Reminds-He's-Brother-Alwaysజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కరోనా పై పోరాటానికి రెండు కోట్ల విరాళం ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయిలు, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో యాభై లక్షలు తన వంతు సహాయంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రేరణతో ఇండస్ట్రీ లో చాలా మంది విరివిగా విరాళాలు ప్రకటించారు.

ఇది ఇలా ఉండగా ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ కేటీఆర్ చేస్తున్న కరోనా నివారణా చర్యలను మెచ్చుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని పొగిడారు. ఈ క్రమంలో కేటీఆర్ ని సార్ అని సంబోధించారు. దీనికి తెలంగాణ ఐటీ మంత్రి వెంటనే స్పందించారు. “థాంక్స్ అన్న … నన్ను సార్ అని పిలవడం ఎప్పుడు మొదలెట్టారు. ఎప్పటికీ మీ తమ్ముడినే,” అని కేటీఆర్ అన్నారు.

ADVERTISEMENT

దీనికి పవన్ కళ్యాణ్ కూడా అవును బ్రదర్ అని రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఈ బ్రోమాన్స్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ తెరాస పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్ర కంట్రోల్ కేసీఆర్ చేతికి వెళ్తుందని ఆరోపించారు.

ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ పెద్దగా తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడలేదు. మొట్టమొదటి సారిగా కేటీఆర్, కేసీఆర్ల ను బహిరంగంగా పొగడ్తలతో ముంచెత్తారు. కేటీఆర్ కూడా పాత విషయాలు మనసులో పెట్టుకోకుండా స్పందించారు. మొత్తానికి విబేధాలు తొలగిపోయాయి అనే అనుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories