‘ఖైదీ నంబర్ 150’ వేడుకలో షాకింగ్ వీడియో!

Pawan Kalyan fans breaks chairs at khaidi no 150 pre release functionభారీ మెగా అభిమాన గణంతో అంగరంగ వైభవంగా ముగిసిన మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” వేడుకలో ఓ అవాక్కైన సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా మెగా హీరోలను తిడుతూ, అక్కడున్న కుర్చీలను నేలకేసి బాదుతూ నానా హంగామా సృష్టించారు అభిమానులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ అసంతృప్తికి కారణం ఏమిటి? అంటే… అక్కడే ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ అన్న మాట వినపడుతోంది.

‘ఖైదీ నంబర్ 150’ వేడుక ఆద్యంతం మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసలు, అతిశయోక్తులతో ఆహ్వానితులు ముంచెత్తారు. అయితే వేడుకలో ఎవరూ కనీసం పవన్ కళ్యాణ్ ఊసెత్తకపోవడంతో, నిరాశ చెందిన అభిమానులు, ఆగ్రహం తట్టుకోలేక ఆవేశంతో కుర్చీలను నేలకేసి బాదారు. ఒక రకంగా ట్రైలర్ లో చిరు చూపించిన ‘జనాలపై రాడ్ పట్టుకుని కూర్చున్న షాట్’ను ఫ్యాన్స్ లైవ్ లో రిపీట్ చేసారు. ‘ఒక్కడూ కూడా కళ్యాణ్ బాబు పేరు చెప్పరా…’ అంటూ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో రెచ్చిపోతూ తమ ఆవేదనను కుర్చీలపై చూపించి నిరసన తెలియజేసారు.

ADVERTISEMENT

ఎంతో అద్భుతంగా జరిగిందనుకున్న వేడుకలో సడెన్ ట్విస్ట్ ఇచ్చే విధంగా సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రత్యక్షం కావడంతో, అది కాస్త వైరల్ గా మారింది. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ‘మెగా కాంపౌండ్’ తీరు పట్ల మిక్కిలి అసంతృప్తితో ఉన్నట్లుగా కనపడుతోంది. దీంతో ‘అన్నయ్య’ సినిమాకు ‘తమ్ముడు’ అభిమానుల మద్దతు ఎలా ఉంటుందో అనే సందేహాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT
Latest Stories