పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మియాపూర్ లో జరిగే వకీల్ సాబ్ షూటింగ్ కు ఆయన మాదాపూర్ లో మెట్రో ట్రైన్ ఎక్కారు. ఈ ప్రయాణంలో పవన్ వెంట `వకీల్ సాబ్` నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఈ సంధర్భంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక రైతు తో అతని సమస్యల గురించి సంభాషించడం విశేషం.
ద్రాక్షారామం రైతు చిన సత్యనారాయణతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే పడిన వర్షానికి పంట బాగా దెబ్బతింది అని ఆ రైతు చెప్పుకున్నాడు. ఈ ప్రయాణంలో పవన్‌ను కలవడం పట్ల చిన సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే.. పవన్ నవ్వుతూ.. `మీకే కాదు.. నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసార`ని అన్నారు
అటుఇటుగా వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ తన వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేస్తారు. వకీల్ సాబ్ సంక్రాంతి 2021 విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం కోసం జనవరి 14, 2021 విడుదలను మేకర్స్ దాదాపుగా కంఫర్మ్ చేశారని సమాచారం. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నివేదా థామస్, అంజలి మరియు అనన్య నాగల్లలు కనిపిస్తారు.
ఈ చిత్రంలో శృతి హసన్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేయనున్నారు. గబ్బర్ సింగ్ మరియు కటమరాయుడు తర్వాత ఇది వారి మూడవ కలయిక చిత్రం. ఆమె అతి త్వరలో జట్టులో చేరనుంది. ఒరిజినల్ లో హీరోయిన్ పాత్ర ఉండదు. యితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్ట్యా కథలో కొన్ని మార్పులు చేసి హీరోయిన్ ని పెట్టారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.




