‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యువహీరో నితిన్ నటిస్తున్న “అ…ఆ…” సినిమా ఆడియో మే 2వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ గీతాలను ఆవిష్కరించేందుకు ఓ ముఖ్య అతిథి విచ్చేయనున్నారు. ఆయనెవరో ఇప్పటికే అందరూ అంచనా వేసి ఉంటారు… మరెవరో కాదు… నితిన్ అభిమాన హీరో… త్రివిక్రమ్ స్నేహితుడు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
సోషల్ మీడియా ద్వారా హీరో నితిన్ ఈ విషయాన్ని స్పష్టం చేసాడు. ‘ఇష్క్’ నుండి నితిన్ నటించిన సినిమాలలో ఎక్కువ శాతం పవర్ స్టార్ విడుదల చేసిన ఆడియోలే. దీంతో మరోసారి పవన్ రాక, తనకు మెగా హిట్ అందిస్తుందని ఆశాభావంలో ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. త్రివిక్రమ్ సెల్యూలాయిడ్ గా రాబోతున్న ఈ సినిమాను మే రెండవ లేక మూడవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



