పవన్ గీతాభోధనలు …. జగన్ రప్ప రప్ప ప్రోత్సాహకాలు.?

pawan-kalyan-political-guidelines-to-janasena-leaders

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు గీతోపదేశం చేసారు. పార్టీ అధికార ప్రతినిధుల నుంచి పార్టీ నాయకుల వరకు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో మాట్లేడే సందర్భంలో పార్టీ నిర్దేశించిన గైడ్ లైన్స్ ను తప్పకుండా పాటించాలని ఆదేశించారు.

మీడియా డిబేట్ల లో కానీ సోషల్ మీడియా ప్రచారాలలో కానీ ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లోద్దని, వాటికీ అనుగుణంగా వ్యక్తిగత దూషణలకు దిగొద్దని, ముఖ్యంగా మహిళలను గౌరవించే విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలంటూ కీలక ఆదేశాలిచ్చారు.

ADVERTISEMENT

పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడినా, కూటమి ప్రభుత్వ స్ఫూర్తి కి భంగం కలిగించేలా వ్యవహరించినా పార్టీ ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పై పార్టీ నుంచి తక్షణ చర్యలు తప్పవని తెగేసి చెప్పారు. ప్రత్యర్థుల రాజకీయ ట్రాప్ లో పడి అనవసరమైన అంశాల కు ప్రాధాన్యత ఇవ్వొద్దంటూ హితవు పలికారు.

అయితే గత కొన్ని రోజులకు ముందు పవన్ తన పార్టీ అధికార ప్రతినిధులందరిని కొంతకాలం మీడియా డిబేట్లకు దూరంగా ఉండాలని, కొత్త గైడ్ లైన్స్ తో సరికొత్త రాజకీయ విధానాలతో ముందుకెళ్లేందుకు కొంత గ్యాప్ తీసుకోవాలని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ చేసిన ఈ గీతాబోధనాలకు లోబడి పార్టీ నేతలు ముందుకెళ్లాల్సి ఉంటుంది. వైసీపీ ట్రాప్ లో పది టీడీపీ – జనసేన మధ్య ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వార్లు ఎక్కువవుతున్న ఈ తరుణంలో పవన్ ఆదేశాలు పార్టీ శ్రేణులను కొంతవరకు కట్టడి చేసే అవకాశం కనిపిస్తుంది.

అయితే ఒక పార్టీ అధినేతగా పవన్ తన పార్టీ శ్రేణులను ఈ రకంగా విలువలతో కూడిన రాజకీయతో ముందుకు తీసుకెళ్లడంతో ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రప్ప రప్ప రాజకీయాలు కూడా మరోసారి చర్చకొచ్చాయి.

సొంత పార్టీ శ్రేణులను వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లోద్దని, వారిపై వ్యక్తిగత దూషణలు చెయ్యొద్దని చెప్పడం, మహిళల పట్ల అత్యంత గౌరవప్రదమైన భాష ప్రయోగించాలని ఆదేశించడం పవన్ రాజకీయ ఆలోచన దృక్పధాన్ని సూచిస్తుంది.

మరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ క్యాడర్ చేసే రప్ప రాజకీయాలను ప్రోత్సహిస్తూ, పార్టీ నేతలు చేసే వ్యక్తిగత దూషణలను సమర్థిస్తూ విలువలు – విశ్వసనీయత అనే వాటిని కేవలం మాటలకే పరిమితం చేస్టున్నారు అనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

పవన్ రాజకీయానికి, జగన్ రాజకీయ విధానానికి మాటలకు – చేతలకు మధ్య ఉన్నంత విశాలమైన వ్యత్యసం కనిపిస్తుంది అనేవారి వాదన ఇటువంటి సందర్భాలలో మరింత బలంగా వినిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories