పవన్ ‘జనసేన’ చెంత చేరనున్న సినీ హీరో?

Pawan Kalyan Jana Sena - Actor Suman Poltical Debutఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… తదుపరి సార్వత్రిక ఎన్నికలలో తను బరిలోకి దిగడం ఖాయమని హీరో సుమన్ స్పష్టమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేస్తాననేది మాత్రం సుమన్ చెప్పలేదు. బరిలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైసీపీలు కాకుండా, ఈ సారి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ కూడా ఉండడంతో, సుమన్ జనసేనలో చేరతారేమో అన్న టాక్ వినపడింది. దీనిపై ఇంకా స్పష్టత రాకముందే, మరోసారి తన పొలిటికల్ ఎంట్రీ మాటలను బహిరంగంగా ప్రకటించారు సుమన్.

ఒంగోలులో ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సుమన్, మీడియాతో మాట్లాడుతూ… 2019 ఎన్నిక‌ల్లో త‌న‌ రాజ‌కీయ ప్ర‌వేశం ఉంటుంద‌ని, అయితే తాను ఏ పార్టీ వైపుకు వెళ్తానో ఇప్పుడే చెప్ప‌లేనని అన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చే పార్టీకే తాను మ‌ద్ద‌తుగా నిలిచి ప్ర‌చారం చేస్తాన‌ని లేదంటే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాన‌ని స్పష్టత ఇచ్చారు గానీ, పార్టీ పేరును మాత్రం వెల్లడించలేదు. అయితే ద‌క్షిణ భార‌తదేశానికి చెందిన ఓ వ్య‌క్తికి ఖచ్చితంగా ఉప ప్ర‌ధాని ప‌ద‌వి ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తం చేయడంతో, పవన్ నినాదం అందుకుంటారేమో అన్న టాక్ మళ్ళీ హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories