పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన పార్టీ 175 స్థానాల్లో తన అభ్యర్థులను పోటీకి దింపుతున్నట్టు ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో సోమవారం పోస్ట్ చేశారు. ఐతే ఇప్పటిదాకా తెలంగాణా రాజకీయాల పై పవన్ కల్యాణ్ తన స్పష్టమైన అభిప్రాయం చెప్పింది లేదు, ఆంధ్ర లో 175 స్థానాల్లో పోటీ చేస్తాం అని చెప్పినంత దృఢంగా తెలంగాణా గురించి పవన్ ఎందుకనో చెప్పలేకపోతున్నారు.
అదే విధంగా ఇప్పటిదాకా తెలంగాణా రాజకీయాల్లో జనసేన చేసిందేమీ లేదు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం కూడా ఎప్పుడు చెయ్యలేదు. పైగా ఒకటి రెండు సందర్భాలలో పవన్ తెలంగాణా ప్రభుత్వం పై సానుకూలంగానే స్పందించారు. ఈ లెక్కన తనకు తెలంగాణా లో సీన్ లేదని పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టే అనుకోవాలా?
ADVERTISEMENT
ADVERTISEMENT



