ఇలా మాట్లాడితే పవన్ కి పెద్ద దెబ్బే!

pawan-kalyan-jana-sena-politics-2ఓ పక్కన మీడియా ఛానల్స్ అన్నీ సజావుగా ప్రవర్తించాలని, నైతిక విలువలకు కట్టుబడి ప్రసారాలు చేయాలని ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ల వర్షం కురిపిస్తుంటే, మరో పక్కన పవన్ అభిమానులు ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతూ మీడియాలకెక్కుతుండడం విశేషం. తాజాగా పవన్ ఫ్యాన్స్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరం అవుతోంది.

శ్రీరెడ్డిని ఉద్దేశిస్తూ… వర్ణించలేని భాషతో బండ బూతులు తిడుతూ ఓ మహిళ మైక్ ముందు మాట్లాడుతుండగా, ఆమె వెనుక పలువురు ‘జై జనసేన… జై పవన్ కళ్యాణ్…’ అంటూ నినాదాలు చేస్తూ హల్చల్ చేస్తున్న వైనం ఈ వీడియోలో కనపడుతోంది. తమ అభిమాన హీరో సిద్ధాంతాలను, లక్ష్యాలను అర్ధం చేసుకోకుండా ఇలా అసభ్య పదజాలంతో మాట్లాడడం, పవన్ కళ్యాణ్ కు పెద్ద దెబ్బగానే పరిగణించవచ్చు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories