జనసేనకు వచ్చే కొన్ని సీట్లు బీజేపీ ఎగరేసుకుని పోతుందా?

Somu Veerraju - Pawan Kalyanఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాకా జరిగే మొదటి ఎన్నికలు పంచాయితీ ఎన్నికలు. 2019 ఎన్నికల ఘోర పరాజయం తరువాత ఈ ఎన్నికలలో ప్రభావం చూపిస్తే జనసేనను సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. గోదావరి జిల్లాలో కొన్ని కాపుల ప్రాబల్యం ఎక్కువ ఉండే గ్రామాల మీదే జనసేన ఆశలు పెట్టుకుంది.

అయితే అటువంటి చోట్ల పొత్తు అని చెబుతూ… బీజేపీ కొన్ని పంచాయతీలను తీసుకుంటుందని… ఇందువల్ల తమ స్థానాలకు గండి పడుతుందని స్థానిక జనసైనికులు వాపోతున్నారు. “జనసేన బలంతో బీజేపీ ఖాతాలోకి కొన్ని పంచాయతీలు వెళ్ళవచ్చు. అయితే అదే సమయంలో అవి జనసేన ఖాతాలో తగ్గుతాయి. దానితో జనసేన బలం తగ్గి కనిపిస్తుంది,” అని వారు అభిప్రాయం.

ADVERTISEMENT

“పొత్తు ధర్మం పేరిట జనసేన బలంగా ఉన్న చోట్ల బీజేపీ కి ఇస్తాం సరే మరి బీజేపీ ఎక్కడ బలంగా ఉంది? ఈ పొత్తు వల్ల బీజేపీకి లాభం గానీ జనసేనకు ఎటువంటి లాభం లేదు. పైగా నష్టం ఎక్కువ జరిగేలా ఉంది,” అని వారు అంటున్నారు. అయితే క్రింద స్థాయి క్యాడర్ మాట వినిపించుకునే పరిస్థితి ఎక్కడుంది అని వారు ఆగ్రహం చెందుతున్నారు.

ఇప్పటికే తిరుపతి ఉపఎన్నిక సీటు బీజేపీ వదిలే అవకాశం కనిపించకపోవడం అలాగే బీజేపీ కోసం జీహెచ్ఎంసి ఎన్నికల నుండి జనసేన తప్పుకోవాల్సి రావడం వంటి వాటిపై జనసైనికులు మండి పడుతున్నారు. ఇక ముందు ముందు ఈ స్నేహం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories