పవన్… కొత్తగా చెప్పకపోయినా… కొత్తగా చేయాలి..!

pawan Kalyan Janasena‘జనసేన’ పార్టీ సిద్ధాంతాలను ఏమిటో అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లుప్తంగా తెలిపారు. అయితే ఇవేమీ కొత్త విషయాలు కాదు. పార్టీ స్థాపించిన నాటి నుండి పవన్ నోటి వెంట వస్తున్న పదాలే, చెబుతున్న మాటలే. ఇంకా చెప్పాలంటే… చిన్నప్పటి నుండి పాఠ్యపుస్తకాలలో నిక్షిప్తమై ఉన్న భావాలే… అలాగే ప్రతి పార్టీ అధినేత కూడా ప్రజలకు వల్లెవేసే పదాలే..!

కులాలని కలిపే ఆలోచన విధానం
మతాల ప్రస్తావన లేని రాజకీయం
భాషల్ని గౌరవించే సాంప్రదాయం
సంస్కృతులుని కాపాడే సమాజం
ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం
ఇవి దేశపటిష్టతకు మూలాలు

ADVERTISEMENT

ఇవే “జనసేన” సిద్ధాంతాలు…. ఇది పవన్ చేసిన ట్వీట్. చెప్పడానికి మాటలేముంది చెప్పేస్తారు, కానీ ఆచరణకు వచ్చేసరికి ఎలా నిబద్ధతతో ఉంటారనేది కీలకం. ఎందుకంటే పవన్ సోదరుడు చిరంజీవితో సహా, అందరూ రాజకీయ నాయకుల మాటలు ఇలాంటి’ తీయనైన’ పదజాలాన్ని వినియోగించి ప్రజలను మోసం చేసినవారే. అలాగే కొత్త నాయకుడు వచ్చిన ప్రతిసారి, మళ్ళీ ఏదొక చిరు ఆశ ప్రజలలో కలగడం సహజం.

అలాంటి ఆశలనే పవన్ కూడా తన మాటల ద్వారా కల్పిస్తున్నారు. అర్ధవంతమైన రాజకీయాలను మాత్రమే చేస్తానని, నిజాయితీగా ఉంటానని పవన్ చెప్తోన్న మాటలు ఆచరణలో కూడా కనపడితే… నిజంగానే ‘జనసేన’ సిద్దాంతాలకు ఒక అర్ధం ఉంటుంది. కానీ ఇది చెప్పినంత తేలిక అయితే కాదు. కానీ దానిని ‘జనసేన’ అధినేత అయినా సుసాధ్యం చేయాలని, చేస్తారని మాత్రం ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories