ప్రతి ఏడాది తన సన్నిహితులకు తన తోటలోని మామిడిపండ్లను పంచడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆనవాయితీ. మరి ఈ వేసవిలో ఇప్పటివరకు అలాంటి వార్తేమీ ప్రచారంలోకి రాకపోవడంతో, ఈ సారి పంట వేయలేదా లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న ఆసక్తి అభిమాన వర్గాల్లో వ్యక్తమయ్యింది. కానీ, “అ…ఆ…” సినిమా విడుదల మరికొద్ది రోజుల్లో ఉన్న సందర్భంలో హీరో నితిన్ కు అంతకు మించిన కిక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
అభిమాన హీరోనే ఏరికోరి బహుమతి పంపిస్తే… ఆ అనుభూతి ఎలా ఉంటుందో హీరో నితిన్ కే తెలియాలి. బహుశా తన సహచర అభిమానులను కూడా ఊరించాలని భావించారో ఏమో గానీ, పవర్ స్టార్ పంపిన బంగినపల్లి మామిడిపండ్ల బుట్టను ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. సహజంగానే సోషల్ మీడియాలో సందడి చేసే పవన్ కళ్యాణ్ అభిమానులు సదరు బుట్టను షేర్ చేసుకుంటూ… హంగామా చేస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



