ఓజీ… జగన్‌ అభిమాన హీరో ఎవరు?

Pawan Kalyan, OG & AP Politics: Industry Stuck in Fear

గత ప్రభుత్వం 5 ఏళ్ళపాటు తెలుగు సినీ పరిశ్రమకే సినిమా చూపించింది. నేటికీ సినీ పరిశ్రమలో ఆ భయం అలాగే ఉంది. సినీ పరిశ్రమలో నెలకొన్న ఆ భయాన్ని కూటమి ప్రభుత్వం పోగొట్టలేకపోయింది. కనుకనే సాక్షాత్ సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి కందుల దుర్గేష్ ఎంతగా పిలుస్తున్నా ఏపీకి తరలి రావడం లేదనేది బహిరంగా రహస్యం.

మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఆల్-టైమ్‌-ఫేవరేట్ హీరో ఎవరనేది బహుశః ఎవరికీ తెలిసి ఉండదు. కానీ ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ అని చెప్పవచ్చు. అధికారంలో ఉన్నప్పుడే జగన్‌ నిత్యం ఏవిదంగా పవన్‌ కళ్యాణ్‌ నామ స్మరణ చేసేవారో అందరూ చూశారు.

ADVERTISEMENT

నేటికీ భక్త ప్రహ్లాడుడిలా పవన్‌ కళ్యాణ్‌ నామస్మరణతో పునీతమవుతూనే ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ముందు ఓసారి, మళ్ళీ ఇప్పుడు ‘ఓజీ’ రిలీజ్ ముందు వైసీపీ సొంత మీడియా బురద జల్లుతూనే ఉంది.

‘ఓజీ’ అంటే ‘ఒంటరిగా గెలవలేనివాడు’ అని పవన్‌ కళ్యాణ్‌ని ఎద్దేవా చేశారు సరే! కానీ ఒంటరిగా పోటీ చేసిన జగన్‌ గెలవగలిగారా?” అంటూ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు.

సినీ పరిశ్రమ ఏపీకి తరలి రావాలని జగన్‌ మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లయితే వైసీపీ, సొంత మీడియా అందుకు అనుకూలంగా వ్యవహరించాలి. కానీ బాలకృష్ణ, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల సినిమాలు వస్తే ఈవిదంగా బురదజల్లుతూ ఇండస్ట్రీని రమ్మంటే వస్తుందా?

సినీ పరిశ్రమకి, దానిలో వారికీ రాజకీయ సంబంధాలున్నప్పటికీ, సినిమాలను సినిమాలుగానే చూడాలి. కానీ వాటిలో రాజకీయం మిక్స్ చేసి అదే వ్యూహం అంటే తప్పకుండా బెడిసికొడుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాలపై ఎన్ని ట్రోల్స్ అయినా వేసుకోవచ్చు గానీ, ఆయన వెంటబడితే మనమే రాజకీయంగా మరింత వెనకబడతామని ఇప్పటికైనా వైసీపీ తెలుసుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories