పవన్ ట్రెండ్ ఫాలో అవ్వడం ట్రెండ్ సెట్ చేస్తాడు అన్నట్టుగానే OG సినిమాతో పవన్ మరో నయా ట్రెండ్ ను టాలీవుడ్ కి పరిచయం చేసారు. ఇన్నాళ్ళుగా తెలుగు సినిమా ను పైరసి అనే వైరస్ పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. దానికి సరైన వాక్సిన్ వెయ్యాలి అంటూ టాలీవుడ్ ప్రముఖుల నుంచి చోటామోటా సెలబ్రెటీల వరకు ఈ పైరసి భూతం మీద ప్రకటనలు, ప్రసంగాలు చేసారు.
అసలు విషయానికొస్తే., తొలుత సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 10:08 కు టీజర్ లాంచ్ అంటూ ప్రకటించిన నిర్మాణ సంస్థ, ఆ తరువాత హైద్రాబాద్ లో జరిగిన OG మ్యూజికల్ కాన్సర్ట్ లో ట్రైలర్ లాంచ్ ఉంటుంది అని ప్రకటించగా, చివరికి ఈవెంట్ లో కూడా ట్రైలర్ ను అందించలేకపోయింది సంస్థ.
దీనితో అక్కడ భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్ కు వెళ్లిన వారిని నిరుత్సహ పరచకుండా పవన్ ఎంతవరకు ట్రయిలర్ రెడీ అయితే అంతవరకైనా మా అభిమానులకు చుపించాల్సిందే అంటూ దర్శకుడు సుజిత్ ను కోరగా ఆయన కోరిక మేరకు ఈవెంట్ కు వెళ్లిన వారికి మత్రమే అన్నట్టుగా చిత్ర యూనిట్ ట్రయిల్ కట్ ని చూపించింది.
ఇక కాసేపటికో యు ట్యూబ్ లో ట్రయిల్ కట్ అందరికి అందుబాటులోకి తెస్తారులే అనుకున్న పవన్ ఫాన్స్ కి మళ్ళీ ఎదురుచూపులే మిగిలాయి. దీనితో అక్కడ ఈవెంట్ కు వెళ్ళినవారు తమ ఫోన్లలో రికార్డు చేసిన OG మూవీ ట్రైలర్ ను యు ట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో అవే ట్రేండింగ్ లో కూడా ఉన్నాయి.
ట్రయిలర్ కోసం ఆకలిగా ఎదురు చూస్తున్న వారికీ ఇక పైరసీ ప్రింటే దిక్కు అనేలా ఆ ప్రింట్ లోనే తమ అభిమాన హీరో సినిమా ట్రయిలర్ ను చూసి ఆనందిస్తున్నారు ఫాన్స్. అయితే ఇక్కడ ఈ రకమైన పైరసీ కి తప్పెవరిది.? చెప్పిన సమయానికి కనీసం మూవీ ట్రైలర్ కూడా కట్ చెయ్యని చిత్ర యూనిట్ దా.? లేక వారు అందించే వరుకు ఓపిక పట్టలేని అభిమానులదా.?
దీనితో ఈ ఓజీ మూవీతో టాలీవుడ్ కి నయా ట్రెండ్ పరిచయమయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇన్నాళ్లుగా సినిమాలను పట్టిపీడిస్తున్న పైరసి భూతం ఒకపక్క, ఇక సినిమా విడుదలకు ముందే మూవీ కంటెంట్ లీక్ కావడం మరోపక్క టాలీవుడ్ ని ఆర్థికంగా కుంగతీస్తుంది. అయితే అక్కడ తప్పు కుట్ర దారులదైతే మరి ఈ పైరసి వెనుక ఉన్న తప్పెవరిది.?
ఇక మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మీద గుర్రుగా ఉన్నారు పవన్ అభిమానులు. ఇంకా నాలుగు రోజులలో మూవీ రిలీజ్ ఉండగా ఇంతవరకు ట్రైలర్ లేదు, ఒక ప్రమోషన్ ఈవెంట్స్ లేవు, మీడియాలో ఇంటర్ వ్యూ లు లేవు అంటూ సోషల్ మీడియాలో చిత్ర బృందానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారు.
అలాగే పాన్ ఇండియా చిత్రంగా విడుదలవ్వబోతున్న OG అటు బాలీవుడ్ మీద కూడా ద్రుష్టి పెట్టలేకపోతోంది. ఇమ్రాన్ హష్మీ వంటి బాలీవుడ్ నటుడ్ని సినిమా లో భాగం చేసుకున్నప్పటికీ, హిందీ మార్కెట్ ను ఒడిసి పట్టుకునే విధంగా యూనిట్ అక్కడ ప్రొమోషన్ చెయ్యలేదు.
ఇవన్నీ కూడా సినిమా పై, మూవీ కలక్షన్ ల పై నెగటివ్ ఇంపాక్ట్ ని తీసుకొచ్చే అంశాలు. కాబట్టి చిత్ర యూనిట్ మిగితా ఆ కాస్త సమయాన్నైనా OG ప్రమోషన్స్ కు కేటాయించాలన్నది పవన్ అభిమానుల కోరిక.






