పవన్ కళ్యాణ్ కోసం చెడగొడుతున్నారా?

Pawan Kalyan Rana Daggubati  Ayyappanum Koshiyum Movieపవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి అయ్యప్పనమ్ కోషియం రీమేక్ ఈ నెల 11 న తిరిగి షూట్ ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ 13 న షూటింగ్‌లోకి ఎంటర్ కాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసం రెండు రోజుల పాటు షూట్ చేయాలని బృందం యోచిస్తోంది.

అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే… అయ్యప్పనుమ్ కోశియుమ్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లో నటించిన బిజు మీనన్ కు ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఏమీ ఉండదు. ఆయన క్యారెక్టర్ సాదాసీదాగా మొదలయ్యి ఆ తరువాత పరిస్థితుల కారణంగా రెబల్ గా మారుతుంది. ఆ పరిస్థితుల నుండే హీరోయిజం పుడుతుంది.

ADVERTISEMENT

అయితే తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ కోసం మార్పులు చేస్తున్నట్టు ఉంది. అయితే ఈ ప్రయత్నంలో అయ్యప్పనమ్ కోషియం అసలు ఎస్సెన్స్ చెడగొడతారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ మీద త్రివిక్రమ్ పని చేశారు కాబట్టి భారమంతా ఆయన మీదే వేశారు మెగా అభిమానులు.

ఈ చిత్రంలో రానా ఇంట్రడక్షన్ సీన్ ఇప్పటికే షూట్ చేశారట. ఈ చిత్రం సెప్టెంబర్ 9 న వినాయక చవితి స్పెషల్ గా విడుదల చేయబడుతుందని ప్రకటించినప్పటికీ, రెండవ వేవ్ కారణంగా రిలీజ్ డేట్ మారే పరిస్థితి ఉండవచ్చు. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కె చంద్ర ఈ చిత్ర దర్శకుడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రంతో పాటు, పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లును కలిగి ఉన్నారు. ఆ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.

ADVERTISEMENT
Latest Stories