‘వీరమల్లు’ కోసం పవన్ “కర్ర” విన్యాసాలు…!

pawan kalyan rehearsal action sequence for hari hara veera malluభీమ్లా నాయక్ ఇచ్చిన విజయంతో ఊపు మీదున్న పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను అనుకున్న తేదికి పూర్తి చేయాలనీ కంకణం కట్టుకున్నట్లు సెట్స్ లో రిహార్సల్స్ చేస్తున్నారు. ఇపుడు ఇవే పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పవన్ భక్తుడిగా చెప్పుకునే సినీ నిర్మాత బండ్ల గణేష్ పవన్ స్టిల్స్ ని తన ట్విట్టర్ ద్వారా పవన్ అభిమానులతో పంచుకున్నారు.

గన్ను పట్టిన, పెన్నుపట్టిన, కట్టి పట్టిన ,మైక్ పెట్టిన, ఏది పట్టిన.., ఎవరి పై పెట్టిన.., మీకు తిరుగు లేదు దేవర…! అంటూ బండ్ల, పవన్ మీద తనకున్న భక్తిని మరోసారి ప్రదర్శించ్చారు.అసలు విషయానికి వస్త్తే…,పవన్, క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసంల కత్తులతో., కర్రలతో సావాసం చేస్తున్నట్లుంది.

ADVERTISEMENT

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ తో సినిమా మీద ఆసక్తిని పెంచిన క్రిష్ ఇప్పుడు విడుదలైన పవన్ స్టిల్స్ తో ప్రేక్షకుడిలో మరింత ఉత్సుకతను రేపింది. మార్షల్ అర్ట్స్ లో ప్రవేశమున్న పవన్,రెట్టించిన ఆసక్తితో యుద్దవిన్యాసాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎ.ఎం రత్నం ఈసినిమాను భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

రాజుల నాటి కధలో యుద్ధవిద్యలు తెలిసిన ‘గజదొంగ’ పాత్రలో పవన్ కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో కథానాయకిగా ‘పంచమీ’ పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తున్నారు.రెండు చేతులతో కర్రలు పట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్న పవన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories