జనసేనాని రియాలిటీకి ఇంత దూరంలో ఉన్నారా?

pawan kalyan says janasena has 31 percent vote bankజనసేన అధినేత 2019లో ముఖ్యమంత్రి అవ్వడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన జనసేనకు 31% ఓటు బ్యాంకు ఇవాల్టి రోజున ఉన్నట్టు చెప్పారు. 2014లోనే తమకు 18% ఓటు బ్యాంకు ఉందని, తమ వల్ల తెలుగు దేశం పార్టీకి 16-18% ఓట్లు పడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

సోనియా గాంధీకి అందిన ఇంటెలిజెన్సు రిపోర్టు ప్రకారం జగన్ 127 సీట్లతో ముఖ్యమంత్రి కావాల్సిందని, తెలుగుదేశంకు కేవలం 39-56 సీట్లు రావాలని తమ వల్లే అధికారంలోకి వచ్చారని జనసేనాని చెప్పుకొచ్చారు. అయితే విశ్లేషకుల అంచనా వేరుగా ఉంది. పవన్ కళ్యాణ్ మద్దతు, బీజేపీతో పొత్తు లేని రోజుల్లోనే జరిగిన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.

అయితే ఆ ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలు అయ్యేవరకు రిలీజ్ అవ్వలేదు. ఆ ఫలితాలు బట్టే ప్రజలలో టీడీపీ వేవ్ ఉందని తేటతెల్లం అయ్యింది. ఏకంగా 16-18% ఓట్లు జనసేన వల్ల కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఆరోజు పట్టుమని 10 సీట్లు కూడా రాకూడదు. దీనిబట్టి పవన్ కళ్యాణ్ లెక్కలు తప్పు అని వారి అంచనా.

అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకే 31% ఓట్లు పడలేదు. అప్పట్లో కాపులలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు జనసేనపై సగం కూడా లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. దీనిబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కువ అంచనా వేసుకుని అయినా మాట్లాడుతుండాలి లేక కార్యకర్తలలో ఉత్సాహం నింపేప్రయత్నమైన చేస్తుండాలి.

ADVERTISEMENT
Latest Stories