అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఏం చేద్దాం అని వచ్చారో?

pawan-kalyan-sky-praise-for-kcr-any-logicజనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను సందర్శించారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తొలుత కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. వారి భేటీ గంటపాటు సాగింది. బయటకు వచ్చాక పవన్ కళ్యాణ్ భేటీ గురించి స్వయంగా మీడియాతో మాట్లాడారు.

వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని ప్రశంసించారు. విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని అనేకమంది అభిప్రాయపడ్డారని పవన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ అకస్మాత్తు భేటీ సొంత అభిమానులను, కార్యకర్తలని సైతం అయోమయంలో పడేసింది.

ADVERTISEMENT

మీడియాని కంట్రోల్ చేసినా తెలంగాణాలో ఎన్నో సమస్యలు ఇప్పటికి బయటపడుతూనే ఉన్నాయి. అయినా ఈ మూడున్నర ఏళ్ళలో పవన్ కళ్యాణ్ తెలంగాణాలో గళం ఎత్తింది లేదు. ఏడాది క్రితం సంగారెడ్డిలో ఒక సమస్య ఉంది త్వరలోనే వెళ్తా అని పవన్ చెప్పారు కానీ అలాంటిదేమి జరగలేదు. ఈ మధ్యనే ఉస్మానియాలో ఆత్మహత్య చేసుకున్న ఒక యువకుడి కుటుంబాన్ని పరామర్శిస్తా అని చెప్పి చివరి నిముషంలో వాయిదా వేసుకున్నారు.

ఇప్పుడు ఆ అంశం కేసీఆర్ తో మాట్లాడినట్టుగా ఆయనేమి చెప్పలేదు. కేవలం జనసేనకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా పనిగట్టుకుని వెళ్లి కేసీఆర్ ను మెచ్చుకుని రావాల్సిన అవసరం ఏంటో సొంత కార్యకర్తలకు సైతం అర్ధం కాదేమో. పైగా సంబంధాలు ఉంటే సమస్యలు వారి దృష్టికి తేవడం తేలికని చెప్పడం రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అవగాహన ఏపాటిదో తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే కేసీఆర్ కు వంత పాడే మీడియా సోదరులు కొందరులు పవన్ కళ్యాణ్ తో మరిన్ని భజన పలుకులు పలికించారు. అప్పుడే తెరాసతో పొత్తు పెట్టుకుంటారా అని అడిగించుకున్నారంటే పవన్ కళ్యాణ్ మొదటి ప్రయత్నం ఎంతమేరకు బెడిసి కొట్టిందో ఇట్టే అర్ధం అవుతుంది మనకు.

ఆంధ్రాలో చంద్రబాబు అనుభవజ్ఞుడు కావడం వల్ల, ఇక్కడ కేసీఆర్ అమోఘంగా పాలిస్తునందున అసలు రేపు జనసేన అవసరం లేదేమో అనే అనుమానాలు జనాల్లో పవన్ కళ్యాణే కలిపించడం ఆ పార్టీ వారికే మింగుడు పడని అంశం. తెలంగాణాలో ప్రయాణము మొదలు పెట్టకముందే కాడె వదిలేసినట్టు అయ్యింది. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఏం చేదాం అని వచ్చారో ఆయన అభిమానులకైనా అర్ధం అయితే ఆ పార్టీకి చాలా మంచిది.

ADVERTISEMENT
Latest Stories