పవన్ అభిమానులతో ‘అట్లుంటది’ మరి..!

Pawan Kalyan Fans

జగ్గం పేట నియోజకవర్గం మేమంతా సిద్ధం కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పవన్ పవర్ ఏంటో జస్ట్ శాంపిల్ చూపించారు అక్కడి ఆదిత్య కాలేజ్ విద్యార్థులు. కనీసం పవన్ కళ్యాణ్ పేరు కూడా పలకడానికి ఇష్టపడని జగన్ ముందు ‘బాబులకే బాబు కళ్యాణ్ బాబు’ అంటూ నినాదాలు చేస్తూ జగన్ సహనాన్ని పరీక్షించారు అక్కడి యువత.

విద్యార్థులు ఎంతలా పవన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నా అవేమి వినపడనట్టు నటిస్తూ జగన్ వైసీపీ నేతలతో మాట్లాడుతూ బస్సులోకి వెళ్లిపోయారు. ‘పవన్ ఫాన్స్ తో అట్లుంటది మరి’ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు జనసైనికులు, పవన్ అభిమానులు. ఇలా ఊహించని నిరసనతో కంగుతిన్న జగన్ తన ఫ్రస్టేషన్ మొత్తం కాకినాడ సభలో పవన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చల్లబరుచుకున్నట్టు ఉంది.

ADVERTISEMENT

దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, మూడు పెళ్లిళ్లు అంటూ ప్రతిసభలోను పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న జగన్ తనకు పవన్ అభిమానుల నుండి ఎదురైనా నిరసనకు ప్రతిగా ఈ రోజు కాకినాడ సభలో పవన్ మీద కాస్త విమర్శల డోసు పెంచారు. పవన్ కు నాలుగు పెళ్లిళ్ల మాదిరే నాలుగు నియోజకవర్గాలు…పవన్ కు ఎలా అయితే ఏ భార్య మీద ప్రేముండదో అలాగే ఏ నియోజకవర్గం మీద ప్రేముండదు అంటూ లేని నాలుగో భార్య గురించి పోటీ చేయని నాలుగో నియోజకవర్గం గురించి ప్రస్తావించారు.

జగన్ పవన్ ను ఎంతలా కించపరచాలని చూసిన, ఎంతలా అవమానిస్తున్న ప్రజలలో ముఖ్యంగా యువతలో పవన్ పట్ల ఉన్న ఆదరణ నానాటికి పెరుగుతుందే కానీ తగ్గడం లేదనేది నేటి నిరసనతో స్పష్టమయ్యిపొయింది. అయినా కళ్ళునుండి చూడలేని విధంగా చెవుల నుండి గ్రహించలేని పద్దతిలో వైసీపీ ప్రవర్తించడం జగన్ అమాయకత్వమే అవుతుంది.

ఒకరకంగా పదేపదే పవన్ పై ఇటువంటి విమర్శలు చేస్తూ పవన్ కు ప్రజలలో సానుభూతి తెచ్చిపెడుతున్నారు జగన్. జగన్ ఎంతలా పవన్ వ్యక్తిగత జీవితం గురించి విమర్శించినా పవన్ వారి కుటుంబంలోని మహిళల పట్ల ఏనాడూ అమర్యదగా మాట్లాడిందే లేదు అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటున్నారే తప్ప జగన్ వ్యాఖ్యలను ఎవ్వరు సమర్ధించడం లేదనే సత్యాన్ని జగన్ అండ్ కో త్వరలోనే తెలుసుకునే రోజు వస్తుందని ధీమాగా ఉన్నారు పవన్ అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories