పవన్ ఫ్యాన్స్ బాగా హ్యాపీ… ఎందుకంటే..!

pawan -kalyan - Trivikram Srinivas movie release dateపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును అభిమానులు గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న తాజాగా చిత్రానికి సంబంధించి, ఓ పోస్టర్ మరియు అనిరుధ్ మ్యూజిక్ బిట్ తప్ప పెద్దగా ఏమీ విడుదల కాకపోయినా, ఓ విషయంలో మాత్రం పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. టైటిల్ కూడా ఖరారు చేయని ఈ సినిమా విడుదల తేదీని స్పష్టంగా ప్రకటించడంతో ఇతర సినిమాలకు కూడా ఓ క్లారిటీతో కూడిన వార్నింగ్ ను ఇచ్చినట్లయ్యింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నామని స్పష్టంగా అనిరుధ్ వీడియోలో తెలపడంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఆనందం ఊరకలేస్తోంది. విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ, పవన్ ఇచ్చిన స్పష్టతతో ఇంకా ఆ డేట్ కోసం నిరీక్షించడం అభిమానుల వంతవుతోంది. బహుశా దసరా పండగకు టీజర్ ను, దీపావళికి మరొకటి… ఇలా వరుస ఫెస్టివల్స్ తో సంక్రాంతి ఫెస్టివల్ కు పవన్ సందడి చేయడం అనేది చిత్ర యూనిట్ ప్రమోషన్ ప్లానింగ్ గా కనపడుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories