పవన్ కళ్యాణ్ కు మరో శస్త్రచికిత్స?

#PawanKalyan Undergone eye surgeryజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే ఓ సారి కంటికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. గతంలో పోరాటయాత్రకు బ్రేక్ ఇచ్చి ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్న విషయాన్ని జనసేన అధికారికంగా తెలియపరిచింది. కానీ ఈ సారి అలాంటి సమాచారం ఏమీ లభించలేదు గానీ, పవన్ కాలిన ‘సెంటర్ ఫర్ సైట్’ అనే హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం చర్చనీయాంశం అయ్యింది.

ADVERTISEMENT

[m9ad]

బాగా కంటినొప్పి ఉందని తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న పవన్ కళ్యాణ్ నేడు సదరు హాస్పిటల్ లో ప్రత్యక్షం అయ్యారు. అది కేవలం ఇన్ఫెక్షన్ లో భాగమా? లేక పెద్ద ఇబ్బందా? మరో శస్త్ర చికిత్స జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది. బుధవారం నాడు మాత్రం తన అన్న పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఇంటిలో మంచి ఉల్లాసంగానే కనిపించారు జనసేన అధినేత.

ADVERTISEMENT
Latest Stories