వారాహి యాత్రతో వైసీపీలో అయోమయం… మొదలైందా?

pawan kalyanవివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని వెనకేసుకురావడాని వైసీపీ ఏనాడూ తప్పుగా భావించలేదు. కానీ టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేయాలనుకొంటే అది వివేకా హత్య కంటే పెద్ద నేరమన్నట్లు వైసీపీ నేతలు వాదిస్తుంటారు.

“ఒక్క సీటు కూడా గెలుచుకోలేని నన్ను చూసి మీరేందుకు ఇంత భయపడుతున్నారు?” అని పవన్‌ కళ్యాణ్‌ నేరుగా వారినే అడిగేశారు. అటువంటి జనసేన పార్టీతో మేము పొత్తులు పెట్టుకొంటే, 175 సీట్లు మేమే గెలుచుకొంటామని గొప్పలు చెప్పుకొంటున్న మీరెందుకు భయపడుతున్నారని టిడిపి నేతలు ప్రశ్నించారు. కానీ ఇంతవరకు జవాబీయలేదు.

ADVERTISEMENT

కానీ టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోవడం మహానేరం, మహాపాపం… అది మాకు ఇష్టం లేదని వైసీపీ నేతలు పదేపదే చెపుతున్నారు.

ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌, “ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వండి. నేను ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నాను,” అని చెపుతూ టిడిపితో పొత్తులు ఉండవని సంకేతం ఇస్తుంటే, దానినీ వైసీపీ నమ్మడం లేదు. చంద్రబాబు నాయుడు సూచనమేరకే పవన్‌ కళ్యాణ్‌ ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సూచన మేరకే పవన్‌ కళ్యాణ్‌ , ఉభయగోదావరి జిల్లాలలో వారాహి యాత్ర చేస్తూ వైసీపీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు.

“దమ్ముంటే ఒంటరిగా 175 సీట్లకు పోటీ చేయమని” సవాళ్ళు విసిరి, ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ‘సై’ అంటుంటే, ఇది చంద్రబాబు, పవన్‌ కలిసి ఆడుతున్న ‘మైండ్ గేమ్’ అని వైసీపీ నేతలు వాదిస్తుండటం హాస్యాస్పదంగా ఉంది. ఇదో పెద్ద మైండ్ గేమ్ అని కొందరు వాదిస్తుంటే, పవన్‌ కళ్యాణ్‌ అర్దంపర్ధం లేని మాటలు మాట్లాడుతూ, దానినే మా ‘వ్యూహం’ అంటున్నారని మంత్రి అంబటి ఎద్దేవా చేయడం గమనిస్తే వైసీపీలో అయోమయం మొదలైందని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories