దాసరి దగ్గరికి పవన్ కు అనుమతి ఇవ్వని వైద్యులు!

Pawan Kalyan Visits Dasari Narayana Rao Kimsతీవ్ర అనారోగ్యంతో కిమ్స్ లో చికిత్స చేయించుకుంటున్న దర్శకరత్న దాసరి నారాయణరావును పరామర్శించేందుకు ‘జనసేన’ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేసారు. తన తాజా సినిమా ‘కాటమరాయుడు’ చిత్ర నిర్మాత శరత్ మరార్, తన తదుపరి చిత్ర దర్శకుడు, అత్యంత సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ను వెంటపెట్టుకుని కిమ్స్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ ను దాసరిని చూడడానికి వైద్యులు అనుమతి ఇవ్వలేదు.

అయితే వైద్యుల నుండి దాసరికి జరుగుతున్న చికిత్స, కోలుకుంటున్న విధానం గురించి అడిగి తెలుసుకున్న పవన్, ‘దాసరి ఆరోగ్యం మెరుగైందని డాక్టర్లు చెప్పినట్లుగా’ తెలిపారు. దాసరి త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు పవన్. అయితే పవన్ తో సహా దాసరిని పరామర్శించడానికి వచ్చిన ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, పరుచూరి బ్రదర్స్ తో సహా ఎవరినీ దాసరి వద్దకు అనుమతించలేదు. ఇన్ఫెక్షన్ సోకకూడదన్న ఉద్దేశంతో ఎవరినీ అనుమతించడం లేదని వైద్యులు తెలిపారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories