స్పైడర్, జై లవకుశ, పవన్ సినిమాల అప్ డేట్స్!

Pawan Kalyan Vs JR NTR Spyder Jai lava Kusaఈ ఏడాది ఫస్టాఫ్ మొత్తాన్ని ‘బాహుబలి 2’ మేనియా ఊపేయగా, సెకండాఫ్ లో ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు బరిలోకి దిగుతుండడంతో, సినీ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా ఈ మూడు సినిమాలు అతి తక్కువ గ్యాప్ లో విడుదల కానున్నాయన్న సమాచారంతో… ఈ ముగ్గురి హీరోల అభిమానుల్లో ఒక విధమైన పోటీ వాతావరణం నెలకొంది. అయితే చెప్పిన సమయానికి విడుదలయ్యేలా షూటింగ్ సాగుతున్నాయా? అనేది ఫ్యాన్స్ కు సందేహం కలిగించే అంశం.

ముందుగా… అనేక వాయిదాల తర్వాత దసరా సమయానికి ప్రేక్షకుల ముందు వస్తాము అని పక్కాగా చెప్పిన “స్పైడర్” సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ ను పూర్తి చేసుకోగా, ఓ రెండు పాటలను మాత్రం చిత్రీకరించాల్సి ఉంది. అందులో ఓ పాటను జూలై 5వ తేదీ నుండి 11 వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేయనుండగా, మరొక పాటను జూలై మిడిల్ వీక్ లో కేరళలో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ నాటికి సిద్ధమవ్వడం ఖాయం.

ADVERTISEMENT

అయితే తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై కొన్ని సందేహాలు నెలకొన్నాయి. దీంతో పాటు తాజాగా హిందీలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అన్న టాక్ తో బహుశా మళ్ళీ వాయిదా పడుతుందేమో అన్న సందేహాలు ఇటీవల నెలకొన్నప్పటికీ, ఏది ఏమైనా దసరా నాటికి (సెప్టెంబర్ 27వ తేదీన) ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న తలంపుతో చిత్ర యూనిట్ అహర్నిశలు వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం.

ఇక టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ – బాబీ సినిమా “జైలవకుశ” చిత్రాన్ని సెప్టెంబర్ 22వ తేదీన విడుదల చేయాలని భావించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో రిలీజ్ డేట్ పై కొన్ని సందేహాలు నెలకొన్నాయి. అందులోనూ ఆగష్టు చివరి వరకు షూటింగ్ షెడ్యూల్స్ ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం సరిపోతుందా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ‘స్పైడర్’ రిలీజ్ డేట్ పక్కాగా ఫిక్స్ అయితే ‘జై లవకుశ’ రిలీజ్ డేట్ లో మార్పు వస్తుందని సమాచారం.

మూడు భారీ ప్రాజెక్ట్ లలో చివరగా వచ్చేది మాత్రం త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ సినిమానే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా 40 శాతం పెండింగ్ ఉండడంతో, దసరా నాటికి విడుదల కష్టమే అన్న విషయం తేలిపోయింది. దసరా సరదా ముగిసిన తర్వాత అక్టోబర్ లో విడుదల చేస్తారా? లేక దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారో అనే ప్రకటన కోసం అంతా వేచిచూస్తున్నారు. లాంగ్ వీకెండ్ వచ్చినపుడే సినిమాను విడుదల చేయాలన్న కృతనిశ్చయంతో చిత్ర నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories