ఆగష్టులో జరిగిన నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్దానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. అయితే పవన్ కళ్యాణ్ ఏదో దీక్షలో ఉండటం వల్లే ఆ వేడుకకు హాజరు కాలేదని చెప్పి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తాజాగా నిహారిక పెళ్ళికి ఆయన హాజరు అవుతారా అని చర్చ జరిగింది.
నిన్న ఉదయపూర్ లో జరగనున్న ఆ వివాహానికి మెగా కుటుంబ సభ్యులంతా వేరు వేరు స్పెషల్ ఫ్లైట్లలో బయలుదేరి వెళ్లారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళలేదు. నివార్ తుఫాన్ బాధిత రైతులకు నష్ట పరిహారం పెంచాలని పవన్ కళ్యాణ్ తన హైదరాబాద్ ఇంటిలో దీక్ష చేశారు.
దీనితో అసలు పవన్ వివాహానికి హాజరవుతారా అని మళ్ళీ చర్చ జరిగింది. అయితే ఆయన ఈరోజు ప్రత్యేక విమానంలో ఉదయపూర్ వెళ్లారు. 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరగనుంది. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.
ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లి ఉదయ్ పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరిగింది. ఇప్పుడు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం కూడా అదే ప్యాలెస్‌లో జరగనుంది. సుమారు 150 మంది అతిథులు హాజరయ్యేందుకు వీలుగా ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ కరోనా టెస్టులు నిర్వహించే కార్యక్రమానికి హాజరుకానిస్తారట.





