మరో ‘వారసుడు’ రానున్నాడన్న మాట… ఫ్యాన్స్ ‘ఖుషీ..!’

Pawan Kalyan With NewBorn Baby Boyప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతోన్న సినీ ‘వారసత్వం’ను కొనసాగించడానికి, నేటితరం అందరి అగ్ర హీరోలకు వారసులు సంతానంగా కలిగారు. మహేష్ కు గౌతమ్, ఎన్టీఆర్ కు అభిరాం, బన్నీకి అయాన్… ఇలా అగ్ర హీరోలకు ఉన్న వారసులతో పోలిస్తే… తాజాగా జన్మించిన పుత్రుడితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒక మెట్టు పైన ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే రేణుదేశాయ్ వద్ద అకీరా వారసుడిగా రూపుదిద్దుకుంటుండగా, తాజాగా అన్నా లెజ్ నోవాకు పుత్రుడు జన్మించాడన్న వార్త అభిమానుల్లో ఖుషీని నింపుతోంది.

ఓ పాప ఉన్న లెజ్ నోవాకు మంగళవారం నాడు మగ సంతానం కలగడంతో, పవన్ కళ్యాణ్ కు మొత్తంగా నాలుగవ సంతానం కలిగినట్లయ్యింది. రేణుదేశాయ్ కు ఇప్పటికే ఓ పాప, బాబు ఉండగా, అన్నాకు ఇంతకుముందు ఓ పాప ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత సినీ ట్రెండ్ ను చూస్తుంటే… “నేటి పిల్లలే రేపటి హీరోలు” అన్న మాదిరిగా రూపాంతరం చెందుతున్నారు. అయితే పవన్ మాత్రం తన వారసుల విషయంలో… తన జోక్యం ఉండబోదని, వాళ్ళ అమ్మలే నిర్ణయం తీసుకుంటారని వివిధ సందర్భాలలో చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories