టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు గానీ, ఆయా హీరోలు మాత్రం వివిధ సందర్భాలలో తమ బైక్ లపై నెంబర్ 1 సంఖ్యను వేసుకుని అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. ‘ఆగడు’ సినిమాలో మహేష్ బాబు తన రాయల్ ఎన్ ఫీల్డ్ పై నెంబర్ 1 సంఖ్యను వేసుకుని ఫ్యాన్స్ ను ఉత్సాహపరచగా, తాజాగా పవర్ స్టార్ వంతు వచ్చినట్లుంది.
కొబ్బరితోటల్లో హీరోయిన్ శృతిహాసన్ తో కలిసి ముచ్చట్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ రాయల్ ఎన్ ఫీల్డ్ పై బైక్ నెంబర్ 1గా ఉండడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో పవర్ స్టార్ అభిమానుల షేర్లు, లైక్ లతో ఈ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తమిళ సినిమా ‘వీరమ్’కు రీమేక్ గా ఈ ‘కాటమరాయుడు’ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
ADVERTISEMENT
ADVERTISEMENT



