బుచ్చిబాబు పంతం ఖరీదు ఎంత?

Janhvi Kapoor's character in Peddi sparks audience criticism over portrayal and presentation in the film.

టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తూ వచ్చిన “పెద్ది” రిలీజ్ అయ్యింది. అయితే.. వస్తున్న పొగడ్తలతోపాటు, “పెద్ది”పై విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా జాన్వీ కపూర్ పాత్ర కావచ్చు, ఆ పాత్రలో ఆమెను ప్రొజెక్ట్ చేసిన విధానం కావచ్చు 95% జనాలు తీసుకోలేకపోయారు. అమ్మాయిని ఎంత మొరటుగా చూపించినా, అందులో అసభ్యత తగ్గిస్తే బాగుండు అనేది అందరి వాదన. జాన్వీ కపూర్ వక్షోజాలపై పెట్టిన క్లోజప్ షాట్స్, ఆమె నడుము, పిరుదుల చుట్టూ కెమెరాతో ప్రదక్షిణలు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు నచ్చే అవకాశం ఉందేమో కానీ.. మేజర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ను మాత్రం ఇబ్బందిపెట్టింది.

ADVERTISEMENT

దాంతో అందరూ బుచ్చిబాబును తిడుతున్నారు. ఒక సిన్సియర్ స్పోర్ట్స్ డ్రామాలో అలాంటి డబుల్ మీనింగ్ మాటలు, మితిమీరిన ఎక్స్ పోజింగులు అవసరమా అనేది అందరి అభిప్రాయం. అయితే.. ఈ అభిప్రాయం ఆడియన్స్ నుండి వచ్చేకంటే ముందు చరణ్, ప్రొడ్యూసర్స్ మరియు కొంతమంది ఇంటర్నల్ టీమ్ నుండి కూడా వచ్చిందట. “చూసుకో బుచ్చి.. కావాలంటే ట్రిమ్ చేసేద్దాం, అమ్మాయికి మేం సర్దిచెప్పుకుంటాం” అని ఒకటికి పదిసార్లు చెప్పారట.

కానీ.. బుచ్చిబాబు మాత్రం మొండిగా.. “ఉప్పెన టైంలో కూడా ఇలానే అన్నారు. అది నచ్చింది కదా, ఇది కూడా అలానే నచ్చుతుంది. మీరు నన్ను నమ్మి ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఇబ్బందిపెట్టకండి” అని తన స్టైల్ లో వినయంతో కూడిన పంతంతో తెగేసి చెప్పేసాడట. దాంతో ఏం చేయలేక అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అదే సన్నివేశాల ఎఫెక్ట్ సినిమాపై ఎక్కడ పడుతుంది? ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా దూరం పెడతారా సినిమాని? అనే టెన్షన్ టీమ్ & ఫ్యాన్స్ అందరిలోనూ ఉంది.

ఈ విషయంలో జాన్వి కపూర్ కూడా గుర్రు గానే ఉన్నట్లుంది. సినిమా రిలీజై 24 గంటలు కావస్తున్నా.. తిరుపతి వెళ్లి దర్శనం చేసుకుంది తప్పితే.. తన సోషల్ మీడియా అకౌంట్స్ లో సినిమాకి సంబంధించి ఒక్కటంటే ఒక్క పోస్ట్ కానీ, స్టోరీ కానీ షేర్ చేయలేదు. పైగా.. జాన్వీని చాలా చీప్ గా చూపించారు అని పేజ్ పెట్టిన పోస్ట్ కి జాన్వీ లైక్ కొట్టింది. దాంతో.. జాన్వీ కూడా జనాల అభిప్రాయంతో ఏకీభవిస్తుంది అనేది స్పష్టమై.. అందరూ బుచ్చిబాబుని తిడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories