ప్రీ లుక్ పోస్టర్ – ఇంటరెస్టింగ్!

Pen-is-Mighter-than-the-Gun-First-Lookఆసక్తికరమైన పాయింట్స్ ను ఎంచుకుని టాలీవుడ్ లో సక్సెస్ లు కొడుతోన్న యువ హీరోలలో నిఖిల్ ది అగ్రస్థానం. సరికొత్త కధలను, సరికొత్త దర్శకులను పరిచయం చేస్తూ సాగుతున్న నిఖిల్ కెరీర్ లో ఒకటి, అర ఫ్లాప్ లు ఉన్నప్పటికీ, ప్రామిసింగ్ యాక్టర్ గా ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. దానిని మరో మెట్టు పైకి ఎక్కించే విధంగా తాజా సినిమా ప్రీ లుక్ పోస్టర్ దర్శనమిస్తోంది.

‘పెన్ ఈజ్ మైటర్ దాన్ ది గన్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఇంక్ పెన్ పాళీలో నిఖిల్ నడిచోస్తున్న దృశ్యం… అలాగే చుట్టూ ప్రముఖ మీడియా ఛానల్స్ లోగోలు… కలగలిపి సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. అందులోనూ ఇటీవల జర్నలిజంపై పలు వివాదాలు చేలరగడం, అందుకు సంబంధించిన కాన్సెప్ట్ కావడంతో నిఖిల్ పెన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories